alive after death: చనిపోయి తిరిగి బతికిన వారు చెబుతున్న కథల్లోని నిజం ఇదే... ఉత్కంఠ కలిగించే విషయాలను వెల్లడించిన శాస్త్రవేత్తలు!
ABN , First Publish Date - 2023-03-07T07:27:32+05:30 IST
alive after death: మా ఊరిలో ఒక బామ్మ ఉండేది. ఇప్పుడు ఈ లోకంలో లేదు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఒకరోజు ఉదయం ఆమె చనిపోయింది. గ్రామంలోని చాలామంది ఆమె ఇంటి బయట గుమిగూడారు.
alive after death: మా ఊరిలో ఒక బామ్మ ఉండేది. ఇప్పుడు ఈ లోకంలో లేదు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఒకరోజు ఉదయం ఆమె చనిపోయింది. గ్రామంలోని చాలామంది ఆమె ఇంటి బయట గుమిగూడారు. ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఆమె అంతిమ వీడ్కోలు కోసం సన్నాహాలు ప్రారంభించారు. అయితే శ్మశాన వాటిక(Graveyard)కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆమె శరీరంలో కదలిక కనిపించింది.
మొదట అక్కడున్నవారంతా భయపడిపోయారు. కానీ వెంటనే వారు తేరుకున్నారు. ఆమె సజీవంగానే ఉన్నదని, ఊపిరి పీల్చుకుంటున్నదని గ్రహించారు. కొద్దిపేపటి తరువాత ఆమె స్పృహ(Consciousness)లోకి వచ్చింది. అప్పుడు ఆమె చెప్పిన కథ విని అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. తాను చనిపోయాక స్వర్గానికి చేరుకున్ననని, కానీ అక్కడ తన మరణం ఇంకా రాసి ఉండకపోవడంతో దేవుడు(God) తనను తిరిగి భూలోకానికి పంపించాడని ఆమె చెప్పింది. దీంతో పాటు తాను అక్కడ తన పూర్వీకులను(Ancestors) కూడా కలిశానని చెప్పింది. అయితే ఈ బామ్మ మాటను అందరూ జోక్‌గా తీసుకున్నారు.
కాగా తాజాగా శాస్త్రవేత్తలు(Scientists) దీనిపై పరిశోధనలు చేసి, బయటపెట్టిన రిపోర్టును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. డా. చార్లెస్ బ్రూస్ గ్రేసన్ బ్రిటన్‌కు చెందిన పరిశోధకుడు. చనిపోయి తిరిగి బతికిన చాలా మంది కథలను ఆయన విన్నారు. అందుకే దీనిపై పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిశోధనలో భాగంగా అతను మరణం(death) తర్వాత తిరిగి వచ్చానని చెప్పే చాలా మంది వ్యక్తులతో మాట్లాడారు. వారి సంభాషణ, వారు చెప్పే కథల ఆధారంగా 'After: A Doctor Explores What Near Death Experiences Reveal About Life and Beyond' అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో అతను వెల్లడించిన కథలు పల్లెటూరి బామ్మ చెప్పే కథలే. డాక్టర్ చార్లెస్ బ్రూస్ గ్రేసన్(Dr. Charles Bruce Grayson)తో మాట్లాడిన వారంతా తాము అక్కడ తమ పూర్వీకులను కలిశామని, తమకు ఇంకా జీవించే సమయం ఉండటంతో తిరిగి భూమిపైకి పంపారని చెప్పారు.
డాక్టర్ చార్లెస్ బ్రూస్ గ్రేసన్ మాట్లాడుతూ ఎవరైనా మరణించినప్పుడు అన్ని బాధల నుండి విముక్తి(emancipation) పొందుతారు. అప్పుడు వారికి ప్రశాంత స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇటువంటి అనుభూతికి లోనయినవారిలో కొందరు తమ శరీరం నుండి ఆత్మ బయటకు రావడాన్ని చూశామని తెలిపారు. ఆ తరువాత వీరు తమ పూర్వీకులను కలుస్తున్నారు. కొద్దిసేపటి తరువాత అకస్మాత్తుగా(suddenly) మళ్లీ సజీవంగా మారుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని మరణానికి సమీపంలో ఉన్న అనుభవం అని అంటారు. ఇది చాలా కొద్దిమందికి మాత్రమే కలుగుతుంది. అయితే ఈ అనుభవాన్ని చవిచూసిన వారంతా దానిని ఫీల్ అయిన తరువాతనే వెల్లడిస్తున్నారు. అంటే వీరు లేనిపోనివి చెప్పడం లేదని డాక్టర్ చార్లెస్ బ్రూస్ గ్రేసన్ అన్నారు.