Home » Science
శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమై.. అంతరిక్ష రంగంలో సంస్థ చేసిన పరిశోధనల గురించి తెలుసుకున్నారు.
చంద్రయాన్-3 ఘన విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తదుపరి మూన్ మిషన్లు చంద్రయాన్-4, 5పై దృష్టిపెట్టింది.
శత్రుదేశాల గుండెల్లో గుబులు పుట్టించగల స్వీయ విధ్వంసక డ్రోన్ను ‘నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్’ (ఎన్ఏఎల్) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. 30 హెచ్పీ సామర్థ్యం గల ఇంజిన్తో కూడిన ఈ డ్రోన్ వెయ్యి కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు.
కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లో బోధనకు ఇంజనీరింగ్ ఇతర బ్రాంచ్ల ప్రొఫెసర్లు కూడా అర్హులేనని జేఎన్టీయూ స్పష్టం చేసింది.
పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింతగా ఆహ్వానిస్తున్నట్టు నిర్మల పేర్కొన్నారు. ప్రాథమిక పరిశోధన, నమూనా అభివృద్ధిలకు అనుసంధాన్ జాతీయ పరిశోధన నిధి ద్వారా కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
జపనీస్ శాస్త్రవేత్తలు(Japan Scientists) మానవ చర్మంతో రోబోకి ముఖాన్ని రూపొందించి అరుదైన రికార్డు సృష్టించారు. మానవ చర్మంతో రూపొందించిన చిరునవ్వుతో ఉన్న ఈ ముఖాన్ని హ్యుమనాయిడ్ రోబోకి జత చేయవచ్చు. రోబోల ముఖ కవళికలు అచ్చం మనిషిలా ఉండాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.
దోస్త్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 76,290 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా.. వీరిలో 58,920 (77.23 శాతం) మంది కామర్స్, లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్ కోర్సులనే ఎంపిక చేసుకున్నారు.
శరీరం వేడి, శ్వాసలోని బొగ్గుపులుసువాయువు శాతం, దుస్తులు రంగు, శ్వేదం వాసన తదితరాల ఆధారంగా దోమలు కొందరికే ఎక్కువగా టార్గెట్ చేస్తాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
సుమారు 25 కోట్ల సంవత్సరాల క్రితం భూమ్మీద ఏకంగా 20 లక్షల ఏళ్ల పాటు వర్షం కురిసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమిపై జీవానికి మూలం ఏది? అనే ప్రశ్నకు ఇప్పటికీ నిర్దిష్టమై సమాధానం లేదు. ఈ రహస్యాన్ని చేధించేందుకు గత కొన్ని శతాబ్దాలుగా నిరంతరాయంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో సిద్ధాంతాలు తెరపైకి వచ్చి కొత్త సమాచారం తెలిసినప్పటికీ జీవానికి మూలం ఎక్కడనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు.