అత్యంత భారీ కాయం కలిగిన ఏనుగు ఒక రోజులో ఎంత ఆహారం తింటుంది? ఎంత నీరు తాగుతుందో తెలిస్తే...
ABN , First Publish Date - 2023-05-06T13:30:49+05:30 IST
ఏనుగు(elephant)ను చూసేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఉత్సాహం చూపిస్తారు. ఈ భారీ జంతువు ఆకృతి ఇతర జంతువులకు పూర్తి భిన్నంగా ఉంటుంది.
ఏనుగు(elephant)ను చూసేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఉత్సాహం చూపిస్తారు. ఈ భారీ జంతువు ఆకృతి ఇతర జంతువులకు పూర్తి భిన్నంగా ఉంటుంది. భారీ కాయం కలిగిన ఏనుగు ఎంత ఆహారం(food) తింటుందనే ప్రశ్న అందరిమదిలో మెదులుతుంది.
ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీడియాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏనుగులు సాధారణంగా ఆకులు, కొమ్మలు, బెరడు, వేర్లు, పండ్లు, పువ్వులు మొదలైనవి తింటాయి. చెట్టులోని కాండం భాగాన్ని కూడా తినడానికి ప్రయత్నిస్తాయి. ఏనుగు ఎప్పుడూ శాఖాహారమే(Vegetarian food) తింటుందనేది నిస్సందేహం. భారతదేశంలో కనిపించే పెంపుడు ఏనుగులు రొట్టెలను కూడా తింటాయి.
ఏనుగు తినే ఆహార జాబితాలో చెరకు, అరటిపండ్లు మొదలైనవి కూడా ఉన్నాయి. ఏనుగు ఒక రోజులో సగటున 150 కిలోల ఆహారాన్ని తింటుంది. విపరీతంగా ఆకలి(hunger) వేసినప్పుడు ఇది దీనికి రెండు రెట్లు అధికంగానూ తింటుంది. ఇక అది తాగే నీరు విషయానికొస్తే ఏనుగు రోజుకు 45 నుంచి 50 లీటర్ల నీరు తాగుతుంది.
వేడిగా ఉండే ప్రాంతాల్లోని ఏనుగులు నీటిని ఎక్కువగా తాగుతాయి. ఆహారం, నీటి(water) కోసం ఏనుగులు రోజూ 10 నుండి 20 కిలోమీటర్ల దూరం వరకు నడుస్తాయి. ఒక నివేదిక(Report) ప్రకారం ఏనుగులు రోజులో ఎక్కువ సమయం తినడంలోనే గడుపుతాయి.