రూ.5,10, 20... ఒక్కో చిప్స్ ప్యాకెట్‌పై దుకాణదారునికి ఎంత లాభం వస్తుంది? బ్రాండెడ్‌కి, లోకల్‌కి ఎంత తేడా అంటే...?
ABN , First Publish Date - 2023-04-13T11:40:41+05:30 IST
చిప్స్ మార్కెట్లో రూ.5, రూ.10, రూ.20 మొదలుకొని పెద్ద ఫ్యామిలీ ప్యాక్(Family Pack)ల వరకు అందుబాటులో ఉంటాయి.
చిప్స్ మార్కెట్లో రూ.5, రూ.10, రూ.20 మొదలుకొని పెద్ద ఫ్యామిలీ ప్యాక్(Family Pack)ల వరకు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా ఎవరైనా దుకాణానికి వెళ్లి 5, 10 లేదా 20 రూపాయలు చెల్లించి చిప్స్ ప్యాకెట్(packet of chips) కొనుగోలు చేస్తుంటారు. అటువంటి సందర్భంలో చిప్స్ ప్యాకెట్ దుకాణదారుడికి ఎంత లాభం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్(market)లో లేస్, బింగో చిప్స్ ఎక్కువగా కనిపిస్తాయి.
ఇవేకాకుండా చాలా కంపెనీలు కూడా మార్కెట్‌లోకి చిప్స్‌ను తీసుకువచ్చాయి. చిప్స్ ప్యాకెట్ అమ్మితే వచ్చే లాభం(profit) గురించి ఒక కిరాణా వ్యాపారి తెలియజేశారు. 20 రూపాయల చిప్స్ ప్యాక్ విషయానికి వస్తే దుకాణదారుడికి(shopkeeper) ఆ ప్యాకెట్ కొనుగోలుకు 18 ఖర్చవుతుందని తెలిసింది. దానిని విక్రయిస్తే అతనికి 2 రూపాయలు వస్తుందన్నమాట. రూ. 10 ప్యాకెట్ దుకాణ దారునికి రూ.9కి లభిస్తుంది.
దీనిపై ఒక రూపాయి లాభం వస్తుంది. ఇప్పుడు అత్యధికంగా అమ్ముడవుతున్న చిప్స్ ప్యాకెట్ అంటే అంటే రూ. 5 ప్యాక్ విషయానికి వస్తే.. అది దాదాపు రూ.4.50కి వస్తుంది. దీని ప్రకారం చూస్తే దుకాణదారుడు(shopkeeper) చిప్స్ ప్యాక్‌పై సుమారు 10% మేరకు లాభం పొందుతాడు. మొత్తంగా చూస్తే దుకాణదారుడు రూ.5 ప్యాకెట్‌పై 50 పైసలు, రూ.10 ప్యాకెట్‌పై రూ.1, రూ.20 ప్యాకెట్‌పై రూ.2 లాభం పొందుతాడు. కాగా కొన్ని స్థానిక కంపెనీ(local company)ల చిప్స్ ప్యాకెట్లపై దుకాణదారునికి దాదాపు 10 నుండి 15 శాతం లాభం వస్తుంది.