నిగనిగలాడే బొప్పాయిని చూసి మోసపోకండి... అది తీపిగా ఉందో లేదో ఇలా తెలుసుకోండి... లేదంటే డబ్బులు వేస్ట్!

ABN , First Publish Date - 2023-04-26T08:37:11+05:30 IST

బొప్పాయి(papaya) ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే పండు. అయితే అది తీపిగా లేకపోయినా లేదా సరిగా పండకపోయినా దాని రుచి అస్సలు బాగోదు.

నిగనిగలాడే బొప్పాయిని చూసి మోసపోకండి... అది తీపిగా ఉందో లేదో ఇలా తెలుసుకోండి... లేదంటే డబ్బులు వేస్ట్!

బొప్పాయి(papaya) ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే పండు. అయితే అది తీపిగా లేకపోయినా లేదా సరిగా పండకపోయినా దాని రుచి అస్సలు బాగోదు. అందుకే బొప్పాయి కొనుగోలు(buying) చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. తద్వారా మనం మంచి బొప్పాయిని కొనుగోలు చేయగలుగుతాం. బొప్పాయి పండినప్పుడు దానిపై పసుపు రంగు చారలు(Yellow stripes) ఏర్పడతాయి.

బొప్పాయిపై మీకు కనీసం ఒక్క పసుపు చార లేదా నారింజ రంగు చార కనిపించకపోతే దానిని కొనకండి. అలాంటి బొప్పాయి అస్సలు తీపిగా ఉండదు. బొప్పాయిని దాని దిగువ భాగంలో మెల్లగా నొక్కి చూడండి. అప్పుడది నొక్కుకుపోతే దానిని కొనుగోలు చేయకండి. ఎందుకంటే అది లోపలి నుండి కుళ్ళిపోయి(rotten) ఉండవచ్చు. బొప్పాయి కింది భాగంలో లేదా పైభాగంలో ఫంగస్ ఉంటే, దానిని కొనవద్దు.

ఎందుకంటే అది పాడయిపోయిందనడానికి గుర్తు. బొప్పాయి కొనే ముందు దాని వాసన(smell) చూడండి. బొప్పాయి నుండి తీపి వాసన వస్తుంటే, అది లోపల నుండి పండిందని, తియ్యగా ఉంటుందని అర్థం. బొప్పాయి కొనుగోలు చేసేటప్పుడు, దాని తొక్కను కూడా నొక్కడానికి ప్రయత్నించండి. బొప్పాయి పసుపు రంగు(yellow color)లో ఉన్నప్పటికీ, దాని తొక్క గట్టిగా ఉంటే అది ఇంకా పండలేదని అర్థం.

Updated Date - 2023-04-26T08:47:06+05:30 IST