SIM Cards: మీ ఆధార్ కార్డుతో మీకు తెలియకుండా ఎవరైనా సిమ్ కార్డులు తీసుకున్నారో లేదో ఎలా తెలుసుకోవచ్చంటే..!

ABN , First Publish Date - 2023-07-08T19:11:57+05:30 IST

భారతీయుడిగా మీ గుర్తింపును ధ్రువీకరించే అతి ముఖ్యమైన పత్రం ఆధార్ కార్డు. ప్రభుత్వ పథకాలకే కాదు.. అన్నింటికీ అందరూ ఆధార్ కార్డునే గుర్తింపు కార్డుగా అడుగుతున్నారు. సిమ్ కార్డు తీసుకోవడానికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే. టెలికాం కంపెనీలు మన సిమ్ కార్డ్‌ని యాక్టివేట్ చేయడానికి ఆధార్ నంబర్‌ని ఉపయోగిస్తాయి.

SIM Cards: మీ ఆధార్ కార్డుతో మీకు తెలియకుండా ఎవరైనా సిమ్ కార్డులు తీసుకున్నారో లేదో ఎలా తెలుసుకోవచ్చంటే..!

భారతీయుడిగా మీ గుర్తింపును ధ్రువీకరించే అతి ముఖ్యమైన పత్రం ఆధార్ కార్డు (Aadhar Card). ప్రభుత్వ పథకాలకే కాదు.. అన్నింటికీ అందరూ ఆధార్ కార్డునే గుర్తింపు కార్డుగా అడుగుతున్నారు. సిమ్ కార్డు (Sim Cards)తీసుకోవడానికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే. టెలికాం కంపెనీలు మన సిమ్ కార్డ్‌ని యాక్టివేట్ చేయడానికి ఆధార్ నంబర్‌ని ఉపయోగిస్తాయి. అయితే ప్రస్తుతం సైబర్ నేరాలు (Cyber Crimes) విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో నేరగాళ్లు తప్పుడు ఆధార్ కార్డులతో సిమ్‌లను కొనుగోలు చేస్తున్నారు.

చాలా మంది నేరగాళ్లు ఇతరుల ఆధార్ నెంబర్ ఆధారంగా సిమ్‌ కార్డులను పొంది, వాటితో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆ విషయం ఆ ఆధార్ నెంబర్ కలిగిన వ్యక్తికి కూడా తెలియదు. అందువల్ల మీ ఆధార్ నెంబర్‌తో ఎన్ని సిమ్ కార్డ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆధార్ నెంబర్‌తో ఎన్ని సిమ్ కార్డులు యాక్టీవ్ గా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడం చాలా సులభం. టెలికాం డిపార్ట్‌మెంట్ కు సంబంధించిన ట్యాఫ్కో పోర్టల్‌ని సందర్శించడం ద్వారా మీరు సులభంగా గుర్తించవచ్చు (Sim Cards Linked With Aadhar).

Bank Accounts: చదువుకునేందుకు విదేశాలకు వెళ్లిన వారి బ్యాంక్ అకౌంట్లను ఏం చేస్తారు..? వేరే దేశంలో బ్యాంక్ ఖాతా కావాలంటే..!

https://www.tafcop.dgtelecom.gov.in/ అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసిన వెంటనే మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన సిమ్ కార్డుల జాబితా కనిపిస్తుంది. వాటిలో మీరు వినియోగించని నెంబర్ కనిపిస్తే, దానిని వెంటనే బ్లాక్ చేయవచ్చు. ఈ పద్ధతి ద్వారా సైబర్ నేరగాళ్లు చేసే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

Updated Date - 2023-07-08T19:11:57+05:30 IST