fire temprature: భగభగ మండుతున్న మంట రంగును చూసి అది ఎంత ఉష్ణోగ్రతలో ఉందో ఇట్టే చెప్పవచ్చు... అదెలాగో తెలుసుకుంటారా?
ABN , First Publish Date - 2023-03-25T11:42:02+05:30 IST
fire temprature: భగభగ మండుతున్న మంటను చూసి దాని దాని ఉష్ణోగ్రత(temperature) ఎంతో చెప్పవచ్చని మీకు తెలుసా? మంటకు ఉన్న రంగును చూసి దాని ఉష్ణోగ్రతను ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
fire temprature: భగభగ మండుతున్న మంటను చూసి దాని దాని ఉష్ణోగ్రత(temperature) ఎంతో చెప్పవచ్చని మీకు తెలుసా? మంటకు ఉన్న రంగును చూసి దాని ఉష్ణోగ్రతను ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మంట ఎరుపు రంగు(red color)లో ఉండి, తీవ్రత తక్కువగా ఉంటే.. ఆ మంట ఉష్ణోగ్రత 500 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉందని గ్రహించాలని నిపుణులు(Experts) చెబుతున్నారు. ఎరుపు రంగు మంట ఉన్నప్పుడు దాని ఉష్ణోగ్రత 525 నుండి 900 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. అగ్ని రంగు నారింజ లేదా ప్రకాశవంతమైన(bright) ఎరుపు రంగులో ఉంటే, అప్పుడు ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఆరెంజ్ కలర్(Orange color) ఫైర్, ఎల్లో కలర్ ఫైర్ కనిపిస్తే ఆ మంటల ఉష్ణోగ్రత 1100 నుంచి 1200 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండవచ్చు. మంట రంగు పసుపు, తెలుపు అయితే, దాని ఉష్ణోగ్రత 1300 నుండి 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది.
మంటలో పసుపు, తెలుపు రంగులు పెరుగుతుంటే, ఉష్ణోగ్రత 2500 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వెళ్లగలదని గమనించాలి. అగ్ని నీలి రంగు(blue color)లో కనిపిస్తే, దాని ఉష్ణోగ్రత 2500 నుండి 3000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఇంత సమాచారం తెలుసుకున్నాక అగ్నిలోని ఏ రంగు తీవ్రమైనదనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది. ఊదా రంగులో ఉన్న అగ్ని(fire) అత్యంత తీవ్రమైనదని నిపుణులు చెబుతున్నారు. ఊదా రంగులో ఉండే అగ్ని ఉష్ణోగ్రత 3000 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించి ఉంటుంది.