install best size fan: వేసవిలో ఫ్యాన్ ఇలా ఫిట్ చేస్తే ఎంతో హాయి.. ముందుగా గదుల పరిమాణం.. రెక్కల లెక్కలు ఇలా చూసుకోవాల్సిందే...
ABN , First Publish Date - 2023-03-27T08:08:28+05:30 IST
install best size fan: మీరు ఉండే ఇంటిలోని గది పరిమాణం ఆధారంగా ఫ్యాన్ ఉండాలనే విషయం మీకు తెలుసా? ఫ్యాన్ నుంచి వచ్చే గాలి సాధారణంగా దాని బ్లేడ్‌ల(blades) ప్రకారం నిర్ణయమవుతుంది.
install best size fan: మీరు ఉండే ఇంటిలోని గది పరిమాణం ఆధారంగా ఫ్యాన్ ఉండాలనే విషయం మీకు తెలుసా? ఫ్యాన్ నుంచి వచ్చే గాలి సాధారణంగా దాని బ్లేడ్‌ల(blades) ప్రకారం నిర్ణయమవుతుంది. చిన్న బ్లేడ్ స్పాన్ ఉన్న ఫ్యాన్ కంటే పెద్ద బ్లేడ్ ఉన్న ఫ్యాన్ ఎక్కువ గాలిని అందిస్తుంది. గది పరిమాణం(Room size) ఆధారంగా ఫ్యాన్‌ని ఎంచుకోవడం చాలా తెలివైన పని. పెద్ద బ్లేడ్ ఫ్యాన్లు చిన్న గదిలో సమస్యగా మారుతాయి.
పెద్ద గదులలో చిన్న బ్లేడ్ ఫ్యాన్లు(Small blade fans) ఉంటే తక్కువ గాలి వస్తుంది. గది 75 చదరపు అడుగుల వరకు ఉంటే, అప్పుడు 29 అంగుళాలు లేదా అంతకంటే తక్కువ పరిమాణం బ్లేడ్‌లు కలిగిన ఫ్యాన్‌లు సరిపోతాయి.
అలాగే గది 76 నుంచి 144 చదరపు అడుగుల మధ్య ఉంటే, 36 నుంచి 42 అంగుళాల మధ్య పరిమాణం(size) గల బ్లేడ్‌లు ఉన్న ఫ్యాన్‌లు నప్పుతాయి. 145 నుంచి 225 చదరపు అడుగుల మధ్య ఉండే గదులకు 44 నుంచి 50 అంగుళాల బ్లేడ్‌లు ఉన్న ఫ్యాన్‌లు సరిపోతాయి. అయితే 226 నుంచి 400 చదరపు అడుగుల మధ్య గదులకు 50 నుంచి 54 అంగుళాల మధ్య బ్లేడ్‌లు ఉన్న ఫ్యాన్‌లు ఉత్తమం.
400 చదరపు అడుగుల కంటే పెద్ద గదులకు(larger rooms) అవసరమైన గాలిని అందించడానికి బహుళ ఫ్యాన్లు లేదా 60-అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం కలిగిన బ్లేడ్‌లతో కూడిన పెద్ద ఫ్యాన్ అవసరం కావచ్చు. కాగా ఫ్యాన్‌ను ఎన్నుకునేటప్పుడు గది పైకప్పు ఎత్తును పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. 8 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న పైకప్పులకు డౌన్‌రాడ్ ఫ్యాన్ అవసరం కావచ్చు.