కుక్కలు మిమ్మల్ని వెంబడిస్తూ, మొరుగుతున్నాయా?... అయితే ఈ ఒక్క పని చేయండి... అవి మీ వెంటపడితే ఒట్టు!

ABN , First Publish Date - 2023-04-17T09:33:56+05:30 IST

మనం ఇంటికి, ఆఫీసుకు లేదా మార్కెట్‌కి వెళ్లేటప్పుడు ఒక్కోసారి దారిలో ఎదురయ్యే కుక్కలు(dogs) మనల్ని చూసి వెంబడిస్తూ మొరుగుతుంటాయి.

కుక్కలు మిమ్మల్ని వెంబడిస్తూ, మొరుగుతున్నాయా?... అయితే ఈ ఒక్క పని చేయండి... అవి మీ వెంటపడితే ఒట్టు!

మనం ఇంటికి, ఆఫీసుకు లేదా మార్కెట్‌కి వెళ్లేటప్పుడు ఒక్కోసారి దారిలో ఎదురయ్యే కుక్కలు(dogs) మనల్ని చూసి వెంబడిస్తూ మొరుగుతుంటాయి. అప్పుడు మనకు ఏమి చేయాలో తెలియక మరో దారిలో వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుంటాం. అయితే దీనికి పరిష్కారమార్గాన్ని నిపుణులు(Experts) సూచిస్తున్నారు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వీధి కుక్కలు మన వెంటపడకుండా ఉండాలంటే వాటికి ఆహారం అందించాలి. రాత్రి మిగిలిపోయిన చపాతీలను(Chapatis) మనతో పాటు తీసుకువెళ్లి వాటికి అందించాలి. ఇలా చేయడం వలన ఒక ప్రయోజనం ఉంది. కుక్కలు మీరు తీసుకువస్తున్న చపాతీల వాసనను దూరం నుండే గుర్తిస్తాయి. అప్పుడు అవి మెరగవు. కుక్కలు చాలా బలమైన వాసనశక్తిని(sense of smell) కలిగి ఉంటాయి. మీరు రోజూ వాటికి ఆహారం అందిస్తే అవి మిమ్మల్ని చూసి మొరగడం మానేస్తాయి.

మరో సందర్భంలో కుక్కలు మీ కారు లేదా బైక్ వెనుక పరుగెత్తుతుంటాయి. దీంతో ఒక్కోసారి ప్రమాదాలు(Accidents) జరిగి తీవ్ర గాయాలపాలయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాన్ని వేగంగా నడపకూడదు. కుక్కలు ఎదుట పడినప్పుడు వాహనాన్ని చాలా నెమ్మదిగా నడపండి. వాహనాన్ని వేగంగా డ్రైవింగ్(Driving) చేస్తున్నప్పుడు కుక్కలు మరింత దూకుడుగా ప్రవర్తిస్తాయి.

అందుకే వాటిముందు వాహనాన్ని నెమ్మదిగా నడపండి. కుక్కలకు ఆహారం(food) పెడితే అవి మీ దగ్గరికి వచ్చి, మీతో స్నేహ పూర్వకంగా మెలగుతాయని పలు పరిశోధనలలో వెల్లడయ్యింది. కుక్కలతో మీరు మంచిగా వ్యవహరిస్తే, అవి మీతో చక్కగా మెలగుతాయి. కుక్క చాలా దగ్గరగా వస్తే, దాని తలపై చేయి వేసి, నెమ్మదిగా నిమరండి. అప్పుడు అది మీరు ఎటువంటి హాని(harm) చేయరని గుర్తిస్తుంది.

Updated Date - 2023-04-17T10:10:50+05:30 IST