చాట్ జీపీటీ అమూల్య సలహా: చదివిన విషయాలు ఎప్పటికీ గుర్తుండాలంటే ఈ పనులు చేయండి!
ABN , First Publish Date - 2023-04-15T07:40:45+05:30 IST
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ ఊహకందని ఎన్నో అద్భుతాలు చేస్తోంది. అవి మన జీవితంలో ఎంతో ఉపకరిస్తున్నాయి. ఇదేకోవలో మనం చదివిన విషయాలను
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ(chatgpt) ఊహకందని ఎన్నో అద్భుతాలు చేస్తోంది. అవి మన జీవితంలో ఎంతో ఉపకరిస్తున్నాయి. ఇదేకోవలో మనం చదివిన విషయాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలని చాట్ జీపీటీని అడిగినప్పుడు అది అమూల్యమైన(priceless) సమాధానం ఇచ్చింది. విద్యార్థులకు ఎంతగానో ఉపకరించే ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మననం చేయండి: మీరు ఏదైనా అంశాన్ని పదే పదే అధ్యయనం(study) (మననం)చేస్తే, మీరు దానిని నిత్యం గుర్తుంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మీ టైమ్ టేబుల్(Time table)లో కొంత సమయాన్ని మననం కోసం కేటాయించండి. సాధ్యమైనప్పుడల్లా ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి.
నోట్స్ రాసుకోండి: నోట్స్ రాసుకోవడం(Taking notes) అనేది నిరంతరం గుర్తుంచుకునేలా చేస్తుంది. మీరు ఏది నేర్చుకున్నా దానిని డైరీ లేదా నోట్‌బుక్‌లో రాయండి. ఇది ఆ తర్వాత గుర్తుంచుకోవడానికి మీకు సహాయపడుతుంది.
టెస్ట్ చేసుకోండి: మీరు తరచుగా మీకు మీరు టెస్ట్(Test) చేసుకోవడం వల్ల మీరు నేర్చుకున్న వాటిని గుర్తుంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మీ స్టడీ టైమ్(Study time)లో దీనికోసం కొంత సమయం కేటాయించండి.
కనెక్షన్‌లను ఏర్పరుచుకోండి: మీరు ఏది చదివినా, దానిని మీ జీవితానికి అనుసంధానించేందుకు(connect) ప్రయత్నించండి. ఉదాహరణకు, మీరు ఒక భాష నేర్చుకుంటున్నట్లయితే ఆ భాషలో మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సంభాషించండి.
సమయాన్ని వెచ్చించండి: ఏదైనా నేర్చుకునేటప్పుడు దానికి సమయాన్ని కేటాయించండి. ఆ సమయంలో దానిపై మాత్రమే దృష్టి(vision) పెట్టండి. ఇది మిమ్మల్ని సరైన మూడ్‌లో ఉంచుతుంది అప్పుడు మీరు మరింత సమాచారాన్ని గుర్తుంచుకోగలుగుతారు.
మరింత ఏకాగ్రత: చరిత్ర లేదా సైన్స్ వంటి సబ్జెక్టులు నేర్చుకునేటప్పుడు ఏకాగ్రత(Concentration) వహించండి. తద్వారా మీరు ఆయా అంశాలను మరింతగా అర్థం చేసుకుని గుర్తుంచుకోగలుగుతారు.
వీటిని బాగా ఉపయోగించుకోండి: మీ స్మార్ట్‌ఫోన్(Smartphone) లేదా కంప్యూటర్‌ను ఎక్కువ సమయం పాటు ఉపయోగించడం మానుకోండి. మీరు ఏదైనా నోట్స్ చేతితో రాయండి. ఇది మీ జ్ఞాపకశక్తి(memory)ని మరింతగా పెంచుతుంది.
విశ్రాంతి తీసుకోండి: నిద్రకు తగినంత సమయం అవసరమని గుర్తించండి. ఆరోగ్యకరమైన ఆహారం(food) తీసుకోండి. ఒత్తిడి లేకుండా ఉండండి.
సాధన: మరింత ఎక్కువగా సాధన చేయండి. మీరు ఏదైనా కొత్తదాన్ని నేర్చుకున్న వెంటనే, దాన్ని వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
వినోదం కూడా అవసరమే: ఏదైనా నేర్చుకునేటప్పుడు వినోదం(entertainment)తో కనెక్ట్ అవ్వడం వల్ల మీ మనస్సు మరింత ఉత్సాహంగా ఉంటుంది జ్ఞాపకశక్తి బలంగా మారుతుంది.
సమీక్షించుకోండి: ఏదైనా నేర్చుకున్న తర్వాత మీ అంతట మీరు సమీక్ష(Review)ను చేసుకోండి. ఇది సందర్భోచితంగా ఉండేందుకు సహాయపడుతుంది.