ఇలాంటి భార్యాభర్తలను మీరెక్కడా చూసి ఉండరు.. నాలుగేళ్లు పోరాడి మరీ విడాకులు తీసుకున్నారు.. చివరకు జరిగిందేంటంటే..

ABN , First Publish Date - 2023-02-21T15:52:23+05:30 IST

భార్యాభర్తల (Husband and Wife Relation) మధ్య మనస్పర్థలు, అలకలు సహజం. వాటిని సరిదిద్దుకుని తిరిగి కలిసిపోవడమూ అంతే సహజం. అయితే చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోయి విడాకుల వరకు వెళ్తున్న నేటి దంపతులకు గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన ఓ గుణపాఠం.

ఇలాంటి భార్యాభర్తలను మీరెక్కడా చూసి ఉండరు.. నాలుగేళ్లు పోరాడి మరీ విడాకులు తీసుకున్నారు.. చివరకు జరిగిందేంటంటే..

భార్యాభర్తల (Husband and Wife Relation) మధ్య మనస్పర్థలు, అలకలు సహజం. వాటిని సరిదిద్దుకుని తిరిగి కలిసిపోవడమూ అంతే సహజం. అయితే చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోయి విడాకుల వరకు వెళ్తున్న నేటి దంపతులకు గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన ఓ గుణపాఠం. అహ్మదాబాద్‌కు చెందిన ఓ డాక్టర్, ఓ ప్రొఫెసర్ విడాకుల (Divorce) కోసం నాలుగేళ్లు పోరాటం చేసి విడిపోయారు. తర్వాత ఒకరిని విడిచి మరొకరు ఉండలేక తిరిగి కలిసిపోయారు. తమ విడాకులను రద్దు చేయాలని తిరిగి కోర్టు మెట్లెక్కారు.

అహ్మదాబాద్‌కు (Ahmedabad) చెందిన ఓ డాక్టర్, ఓ ప్రొఫెసర్ 2006లో పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల తర్వాత 2009లో వీరికి కొడుకు పుట్టాడు. ఆ తర్వాత మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. గాంధీనగర్ ఫ్యామిలీ కోర్టులో 2011లో విడాకుల కేసు విచారణకు వచ్చింది. నాలుగేళ్ల విచారణ అనంతరం 2015లో గాంధీనగర్ కోర్టు వారిద్దరికీ విడాకులు ఇచ్చింది. విడాకుల తర్వాత కొడుకు కోసం వారిద్దరూ అప్పుడప్పుడు కలుసుకునే వారు. ఇద్దరూ వేర్వేరుగా వివాహ ప్రయత్నాలు చేసినా వారెవరూ వీరికి నచ్చలేదు. తమ పాత భాగస్వామే ఉత్తమం అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ ప్రేమలో పడ్డారు.

Viral Video: వచ్చింది.. విరాట్ కోహ్లీని ముద్దు పెట్టుకుంది.. వెళ్ళింది.. మరో ప్రేయసి కాదండోయ్..!


తమ విడాకులను రద్దు చేయాలని ఆ భార్య గుజరాత్ హైకోర్టును (Gujarat High Court) ఆశ్రయించింది. భార్య నిర్ణయానికి భర్త కూడా మద్దతు పలికాడు. తాము ప్రస్తుతం సహజీవనం చేస్తున్నామని, వివాదాలన్నీ పరిష్కరించుకున్నామని కోర్టుకు తెలిపారు. భార్యాభర్తల అభ్యర్థన మేరకు వారి విడాకులను హైకోర్టు పక్కన పెట్టింది. అలాగే దిగువ కోర్టు నుంచి మొత్తం కేసును ఉపసంహరించుకోవడానికి వారికి 10 రోజుల గడువు ఇచ్చింది.

Updated Date - 2023-02-21T15:52:25+05:30 IST