Share News

Husband: భార్య పుట్టిన రోజుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన భర్త.. భార్య బండారం బయటపెట్టిన ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-11-04T18:44:18+05:30 IST

ఆ వ్యక్తి తన భార్య పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేశాడు. ఓ మంచి గిఫ్ట్ ఇచ్చి ఆమెను సెలబ్రేట్ చేశాడు.. ఆ గిఫ్ట్ చూసి అతడి భార్య ఎంతో సంతోషించింది.. చివరకు ఆ గిఫ్ట్ ఆ మహిళ బండారాన్ని బయటపెట్టింది.. చివరకు వారిద్దరి మధ్య మనస్పర్థలు మొదలై విడిపోయారు.. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Husband: భార్య పుట్టిన రోజుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన భర్త.. భార్య బండారం బయటపెట్టిన ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే..

ఆ వ్యక్తి తన భార్య (Wife) పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేశాడు. ఓ మంచి గిఫ్ట్ (Gift) ఇచ్చి ఆమెను సెలబ్రేట్ చేశాడు.. ఆ గిఫ్ట్ చూసి అతడి భార్య ఎంతో సంతోషించింది.. చివరకు ఆ గిఫ్ట్ ఆ మహిళ బండారాన్ని బయటపెట్టింది.. చివరకు వారిద్దరి మధ్య మనస్పర్థలు మొదలై విడిపోయారు.. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. తన స్నేహితుడి జీవితంలో ఇది జరిగిందంటూ ఓ వ్యక్తి ఓ డేటింగ్ వైబ్‌సై‌ట్‌లో పోస్ట్ చేశాడు (Viral).

యూకేకు చెందిన ఓ వ్యక్తి తన భార్య పుట్టిన రోజు సందర్భంగా అందమైన డోర్‌బెల్‌ను గిఫ్ట్‌గా (Birth day Gift) ఇచ్చాడు. ఆ డోర్‌బెల్ (Door Bell) ప్రత్యేకత ఏంటంటే అందులో ఓ కెమేరా (Camera) కూడా ఉంటుంది. ఆ విషయం ఆ మహిళకు తెలియలేదు. ఆ సీక్రెట్ కెమేరాలోని ఫుటేజ్ భర్త సెల్‌కు వెళుతుంది. భర్త ఇచ్చిన డోర్‌బెల్‌ను ఆ ఇల్లాలు ఇంటి మెయిన్‌డోర్‌కు ఫిక్స్‌ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ భర్త తన మొబైల్‌ ఫోన్‌లోని ఫుటేజ్ చూడగా షాకింగ్ విషయం బయటపడింది. ఓ వ్యక్తి ఇంటికి వచ్చినపుడు అతడి భార్య బయటకు వచ్చి అతడిని కౌగిలించుకుని అసభ్యంగా ప్రవర్తించడం రికార్డు అయింది.

Viral Video: నమ్మండి.. ఇది ఇల్లే.. నాలుగడుగుల స్థలంలో మూడంతుస్థుల బిల్డింగ్ ఎలా కట్టారో చూడండి..

ఆ ఫుటేజ్ చూసి ఆ వ్యక్తి షాకయ్యాడు. తన భార్య తనను మోసం చేస్తోందని తెలుసుకుని నివ్వెరపోయాడు. అప్పట్నుంచి క్రమంగా భార్యకు దూరమయ్యాడు. అలా ఆ ఇద్దరు విడిపోయారని ఆ పోస్ట్‌ చేసిన వ్యక్తి వివరించాడు. మొత్తానికి డోర్‌బెల్ తన స్నేహితుడి వివాహాన్ని విచ్ఛిన్నం చేసిందని ఆ వ్యక్తి చెప్పాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-11-04T18:44:20+05:30 IST