Viral News: పెళ్లి రోజు వేడుకలకు భార్యను స్టార్ హోటల్‌కు తీసుకెళ్తే షాకింగ్ సీన్.. ఇలా జరుగుతుందని ఆ భర్త కలలో కూడా ఊహించి ఉండడు..!
ABN , First Publish Date - 2023-04-26T11:21:30+05:30 IST
పెళ్లి రోజు వేడుకల కోసం కుటుంబ సభ్యులతో కలిసి హోటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని విధంగా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి రోజు వేడుకల కోసం కుటుంబ సభ్యులతో కలిసి హోటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని విధంగా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకు ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపిన అతడు నిమిషాల వ్యవధిలోనే భార్య, కూతురికి దూరమయ్యాడు. ఇప్పటికీ ఆ కుటుంబ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. పాపం.. అతడి భార్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పెళ్లిరోజే భర్తను కోల్పోయిన ఆమె ఇంకా షాక్‌లోనే ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ హృదయవిదారక ఘటన రాజస్థాన్‌లోని (Rajasthan) బండి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బండి పట్టణంలోని న్యూకాలనీకి చెందిన నిఖిల్ భాటియా (Nikhil Bhatia) తన ఏడో పెళ్లిరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి సమీపంలోని ఓ హోటల్‌కు డిన్నర్‌కు వెళ్లాడు. అలా హోటల్లో డిన్నర్ చేస్తూ కొద్దిసేపు ఆ కుటుంబం ఆనందంగా గడిపింది. అనంతరం ఇంటికి వెళ్లేందుకు హోటల్‌కు ఎదురుగా అవతలివైపు పార్క్ చేసిన కారును తీసుకుని రావడానికి రోడ్డు దాటేందుకు నిఖిల్ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం నిఖిల్‌ను బలంగా ఢీకొట్టింది. దాంతో అతడి ఒక కాలు విరిగి దూరంగా పడిపోయింది.
Viral Video: ట్విటర్లో ఓ 5 ఏళ్ల బాలిక వీడియోను పోస్ట్ చేస్తూ ఆనంద్ మహీంద్రా షాకింగ్ కామెంట్స్.. నేను భయపడను అంటూనే..
తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో పడి ఉన్న అతడిని చికిత్స కోసం హూటాహూటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడి వైద్యులు నిఖిల్ పరిస్థితి చూసి, కోటా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. ఈ ఘటన నిఖిల్ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అతడికి ఐదేళ్ల కూతురు ఉంది. ఇక అతడి భార్య పరిస్థితి దారుణంగా మారింది. పెళ్లిరోజే భర్తను కోల్పోవడంతో ఆమె బాధ వర్ణనాతీతం. ఈ సంఘటన తర్వాత నిఖిల్ భార్య ఇంకా షాక్‌లోనే ఉంది. దేవుడు తన బంగారు క్షణాన్ని ఇలా నాశనం చేస్తాడని తనకు తెలియదంటూ ఆమె విలపిస్తున్న తీరు అక్కడివారిని కలిచి వేసింది.