Indian Railway: మిడిల్ బెర్త్‌పై మధ్యాహ్నం పడుకోకూడదా..? రైళ్లల్లో ప్రయాణాలు చేసేవాళ్లు తెలుసుకోవాల్సిన 9 రూల్స్ ఇవీ..!
ABN , First Publish Date - 2023-06-12T13:12:05+05:30 IST
చైన్ లాగితే జరిమానాతో పాటు జైలుకు వెళ్లే అవకాశం ఉంది.
ప్రపంచంలో అన్ని వర్గాలవారినీ మోసుకువెళ్ళేది ట్రైన్ మాత్రమే. సౌకర్యవంతమైన జర్నీ ట్రైన్ మాత్రమేనని ఎంతదూరమైనా సురక్షితంగా వెళ్ళచ్చని గట్టిగా నమ్ముతాం. అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు మార్గాలలో భారతీయ రైల్వే ఒకటి. భారతదేశంలోని చాలా నగరాలు రైల్వేల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. 177 ఏళ్ల భారతీయ రైల్వేలు 68 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. IANS నివేదిక ప్రకారం, భారతీయ రైల్వేలో ప్రతిరోజూ 2 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇందులో బీదా, గొప్ప మధ్యతరగతివారు ఇలా అన్ని వర్గాలవారూ ఉన్నారు. ప్రయాణం సులువైన మార్గంలో చేయాలనుకుంటే అది రైలు ద్వారానే సాధ్యం. అయితే ఇందులో కొన్ని మనకు సాధ్యం కాకపోవచ్చు. మరికొన్ని సౌకర్యాల గురించి తెలియకపోవచ్చు. మనకు తెలియని కొన్ని రైలు నియమాలు ఇవిగో.. చదవండి.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రైల్వేశాఖ కొన్ని నిబంధనలను రూపొందించింది. అటువంటి ఎనిమిది నియమాల గురించి సమాచారాన్ని తెలుసుకుందాం. ఇది మీ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.
ప్రయాణాన్ని పొడిగించవచ్చా?
ప్రయాణ సమయంలో మీ ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటే, అదే రైలులో మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. దీని కోసం TTEని సంప్రదించాలి. లేదా IRCTC నుండి టికెట్ బుక్ చేసుకోవచ్చు.
మిడిల్ బెర్త్ గడువు
మిడిల్ బెర్త్ బుక్ చేసుకున్నట్లయితే, దానికి కాలపరిమితి కూడా ఉంటుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మిడిల్ బెర్త్‌ను రిజర్వ్ అయి ఉంటుంది.
రైలు తప్పిపోతే
రైలును మిస్ అయినట్లయితే, వేరే స్టేషన్ నుండి ఆ రైలును పట్టుకోవాలనుకుంటే, మీ సీటు కేవలం 2 స్టేషన్లు లేదా 1 గంట పాటు వేరొకరి పేరు మీద కేటాయించబడదు. దీని తర్వాత టీటీఈ ఆ సీటును మరొకరికి ఇవ్వవచ్చు.
TTE రాత్రిపూట ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదు.
రైల్వే నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత టీటీఈ ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదు. దీంతో పాటు 10 గంటలకు రైలు లైట్లు కూడా ఆఫ్ చేస్తారు.
ఇది కూడా చదవండి: ఏసీ, కూలర్ వాడుతున్నారా..? చల్లగా ఉంటుందని చిన్న పిల్లల విషయంలో ఈ మిస్టేక్స్ చేస్తే..!
రైళ్లకు లగేజీ నియమాలు
ఏసీ బోగీలో 70 కిలోలు, స్లీపర్ కోచ్‌లో 40 కిలోలు, సెకండ్ క్లాస్ బోగీలో 35 కిలోలు తీసుకెళ్లవచ్చు. ఏసీలో 150 కిలోలు, స్లీపర్‌లో 80 కిలోలు, సెకండ్ క్లాస్ బోగీలో 70 కిలోల లగేజీని అదనపు ఛార్జీతో తీసుకెళ్లాలనే నిబంధన ఉంది.
వెయిటింగ్ టికెట్ పై ప్రయాణ నియమం
కౌంటర్ నుండి వెయిటింగ్ టికెట్ తీసుకొని ప్రయాణిస్తే, రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణించవచ్చు, కానీ మీరు ఈ-టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ప్రయాణించినట్లయితే, మాత్రం అది అనుమతించబడదు.
చైన్ లాగితే జరిమానా
రైల్వే బోగీకి బిగించిన చైన్ లాగితే జరిమానాతో పాటు జైలుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సందర్భంలో చైన్ లాగడం అత్యవసర సమయంలో మాత్రమే అనుమతిస్తారు.
ఆహారంపై నియమాలు
స్నాక్స్, ఆహారం, ఇతర ఆహార ఉత్పత్తులపై రైల్వే నిబంధనలను రూపొందించింది. ఏ అమ్మకదారుడూ ఎక్కువ వసూలు చేయలేరు. వీటితోపాటు ఆహారంలో నాణ్యత కూడా ఉండాలి.