ATM నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఏటీఎం లోని ఆ లైట్ రెడ్ కలర్ లోకి మారితే ఖాతా ఖాళీ అవడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-02-11T19:49:57+05:30 IST

మీరు తరచుగా ఏటీఎమ్‌ల (ATM) నుంచి డబ్బులను విత్ డ్రా చేస్తుంటారా? అయితే మీరు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. లేదంటే పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో మీ డబ్బును కోల్పోవాల్సి ఉంటుంది.

ATM నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఏటీఎం లోని ఆ లైట్ రెడ్ కలర్ లోకి మారితే ఖాతా ఖాళీ అవడం ఖాయం..!

మీరు తరచుగా ఏటీఎమ్‌ల (ATM) నుంచి డబ్బులను విత్ డ్రా చేస్తుంటారా? అయితే మీరు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. లేదంటే పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో మీ డబ్బును కోల్పోవాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు (Cyber Frauds) భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏటీఎమ్ సెంటర్ల వద్దే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఏటీఎమ్ కార్డులను మార్చేయడం, కార్డులను క్లోన్ చేయడం, ఏటీఎమ్ గదిలోని సీసీటీవీని (CCTV Hack) హ్యాక్ చేయడం వంటివి చేసి మోసగాళ్లు సులభంగా డబ్బులు కాజేస్తున్నారు. కాబట్టి ఇకపై ఏటీఎమ్ సెంటర్‌కు వెళ్లే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి.

1)మీరు ఎటీఎమ్ మెషిన్‌లో డెబిట్ కార్డు (Debit Cart) పెట్టే ముందు పైన ఉండే స్లాట్‌‌లో గ్రీన్ కలర్ (Green Light) ఉందో లేదో చెక్ చేయండి. గ్రీన్ కలర్ ఉంటేనే మీ కార్డును లోపల పెట్టండి. రెడ్ కలర్ ఉన్నా, పూర్తిగా లైట్ వెలగకపోయినా ఏటీఎమ్ మెషిన్‌ను ఎవరో హ్యాక్ చేశారని అనుమానించండి. ఆ విషయాన్ని అక్కడ ఉండే గార్డుకు తెలియజేయండి.

2)ఏటీఎమ్ మెషిన్‌లో డెబిట్ కార్డు పెట్టే స్లాట్ (ATM slot) వదులుగా ఉన్న కూడా కార్డును పెట్టకండి. కొందరు నిందితులు డమ్మీ స్లాట్‌లను పెట్టి కార్డు మొత్తం సమచారాన్ని తెలుసుకుని డబ్బులు కాజేస్తున్నారు.

3)కొందరు దుండగులు ఏటీఎమ్ సెంటర్‌లోని సీసీటీవీలను కూడా హ్యాక్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏటీఎమ్ పిన్ (ATM Pin Number) ఎంటర్ చేసేటపుడు చేయి అడ్డం పెట్టుకోవడం మంచిది.

4)ఏటీఎమ్ సెంటర్‌లోని ఇతరులపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. చాలా మంది చదువుకున్న వారు కూడా తమ కార్డు మారిపోయిందనే సంగతి తెలుసుకోలేకపోతున్నారు.

ఒక్క రూపాయి ప్యాకెట్‌తో రూ.2 కోట్ల బిజినెస్.. ఇదెలా సాధ్యం అని అవాక్కవుతున్నారా.. ఇతని కథేంటో తెలిస్తే..

Updated Date - 2023-02-11T20:02:48+05:30 IST