Indian Railways: విమానంలోనే కాదు.. రైల్లోనూ విదేశాలకు వెళ్లొచ్చు... అదీ మనదేశం నుంచే... వివరాలివే!

ABN , First Publish Date - 2023-03-08T12:24:46+05:30 IST

Indian Railways: మన దేశం నుంచి వివిధ దేశాలకు వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? వీటిలోని కొన్ని రైళ్లను ఇటీవలే ప్రారంభించారు.

Indian Railways: విమానంలోనే కాదు.. రైల్లోనూ విదేశాలకు వెళ్లొచ్చు... అదీ మనదేశం నుంచే... వివరాలివే!

Indian Railways: మన దేశం నుంచి వివిధ దేశాలకు వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? వీటిలోని కొన్ని రైళ్లను ఇటీవలే ప్రారంభించారు. వీటిలో ప్రయాణించి విదేశాలు చేరుకోవచ్చు. అయితే ఆ రైళ్లలో ప్రయాణించాలంటే పాస్‌పోర్ట్‌(Passport)తో పాటు ప్రయాణ అనుమతి తప్పనినరిగా ఉండాలి. దీనితో పాటు మీరు ప్రయాణించాలనుకునే రైలుకు సంబంధించి ముందస్తుగా టికెట్(ticket) బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లే రైళ్లకు సంబంధించిన సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలు(Bandhan Express Train)

బంధన్ ఎక్స్‌ప్రెస్ 2017లో ప్రారంభించారు. ఇది భారతదేశం- బంగ్లాదేశ్ మధ్య నడుస్తుంది. దీనిని ప్రధాని మోదీ ప్రారంభించారు ఇది కోల్‌కతా నుండి బంగ్లాదేశ్‌లోని ఖుల్నా వరకు నడుస్తుంది.

మైత్రి ఎక్స్‌ప్రెస్

ఈ రైలు 2008లో ప్రారంభించారు. ఈ రైలు భారతదేశంలోని కోల్‌కతా నుండి ఢాకా వరకు నడుస్తుంది. ఈ రైలు 375 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా వీసా(Visa) కలిగి ఉండాలి. మైత్రీ ఎక్స్‌ప్రెస్ రెండు ప్రధాన నదుల మీదుగా వెళుతుంది.

సంఝౌతా ఎక్స్‌ప్రెస్

భారతదేశంలోని అట్టారీ సరిహద్దు(Attari border) నుండి పాకిస్తాన్‌లోని లాహోర్ వరకు నడిచే ఈ రైలు ఇంకా ప్రారంభం కాలేదు. ఇది కాకుండా మరొక రైలు థార్ ఎక్స్‌ప్రెస్ లింక్.. ఇది భారతదేశంలోని జోధ్‌పూర్(Jodhpur) నుండి పాకిస్తాన్‌లోని కరాచీ వరకూ ప్రయాణించేది. దీనిని 2006లో పునరుద్ధరించినా, 2019లో తిరిగి నిలిపివేశారు.

మూడేళ్లుగా ఈ రైలు రద్దు

భారతదేశం- పాకిస్తాన్ మధ్య నడిచే ఈ రైలు సేవలు(services) ప్రస్తుతానికి నిలిపివేశారు, రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నందున ఈ రైళ్లు మూడేళ్లుగా నడవడం లేదు.

Updated Date - 2023-03-08T12:31:30+05:30 IST