Indian Railway: రైళ్లకు అసలు పేర్లు ఎలా నిర్ణయిస్తారు..? Shatabdi, Duronto Express రైళ్ల పేర్ల వెనుక ఇంత కథ ఉందా..?

ABN , First Publish Date - 2023-06-13T13:11:15+05:30 IST

దురంతో రైలు చాలా తక్కువ స్టేషన్లలో ఆగుతుంది. దురంతో అనే పదానికి అంతరాయం లేకుండా అని అర్థం.

Indian Railway: రైళ్లకు అసలు పేర్లు ఎలా నిర్ణయిస్తారు..? Shatabdi, Duronto Express రైళ్ల పేర్ల వెనుక ఇంత కథ ఉందా..?
rail network

రైళ్లు లేకుండా భారతదేశంలో ట్రాఫిక్‌ను ఊహించుకోలేం. చిన్న ఆటోల నుంచి ట్రైన్ల వరకూ సౌకర్యవంతమైన ప్రయాణానికి పెట్టింది పేరు రైలు జర్నీ. భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఉంది. ఇక్కడ ప్రతిరోజు లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైల్వే లైన్ల నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. రైల్వే భారతదేశానికి జీవనాడి లాంటిది. భారతదేశ వ్యాప్తంగా వేలాది రైళ్లు నడుస్తున్నాయి. పొడవు పరంగా ఇది ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రవాణా వ్యవస్థ.

ఆసియాలో రెండవ అతిపెద్ద రవాణా సౌకర్యం, అయితే ఒక్కో రైలుకు ఒక్కో విధమైన పేరు. ముఖ్యంగా ఈ పేర్లతోనే భారతీయ రైల్వే రైళ్ల కు రకరకాల పేర్లను పెడుతుంది. అసలు ఈ పేర్లను ఎలా నిర్ణయిస్తుందో మీకు తెలుసా.. రైళ్లకు పేరు పెట్టేటప్పుడు చాలా విషయాలు గుర్తుపెట్టుకుంటారు. మన రైల్వేలో దాదాపు 13 వేల రైళ్లు, 9 వేలకు పైగా సరుకు రవాణా రైళ్లు ఉన్నాయి. భారతదేశంలో 7 వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అంత పెద్ద వ్యవస్థలో రైలుకు పేరును ఎలా నిర్ణయిస్తారంటే..

కోటా-పాట్నా ఎక్స్‌ప్రెస్, చెన్నై-జైపూర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు ప్రారంభమయ్యే ప్రదేశాలు, అలాగే చేరుకునే ప్రదేశాల పేర్లను కూడా రైళ్లకు పెట్టారు. ఇది కాకుండా, వైశాలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్ వంటి మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం ఆధారంగా వాటికి ఆ పేరు పెట్టారు. బీహార్‌లోని వైశాలి బుద్ధుని కారణంగా ఆపేరును పెట్టారు.

ఇది కూడా చదవండి: పాదాల వద్దే ప్రమాదకర సూచనలు.. బయట ఎంత వేడిగా ఉన్నా పాదాలు మాత్రం చల్లగా ఉంటే జరిగేది ఇదే..!

రాజధాని, దురంతో, శతాబ్ది

రాజధానుల మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి రాజధానుల పేర్లను కూడా రైళ్లకు పెట్టారు. ఇది భారతదేశంలో అత్యుత్తమ రైలు. దీని వేగం గంటకు 140 కిలోమీటర్లు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ 1989లో భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 100వ జన్మదినం సందర్భంగా ప్రారంభించారు. 100 సంవత్సరాల కాలాన్ని శతాబ్ది అని పిలుస్తారు, అందుకే ఈ రైలుకు శతాబ్ది అని పేరు. ఈ రైలు వేగం గంటకు 160 కిలోమీటర్లు.

ఇది కాకుండా, దురంతో రైలు చాలా తక్కువ స్టేషన్లలో ఆగుతుంది. దురంతో అనే పదానికి అంతరాయం లేకుండా అని అర్థం. అందుకే ఈ రైలుకు దురంతో అని పేరు పెట్టారు. ఇది బెంగాలీ పదం. దీని వేగం గంటకు 140 కిలోమీటర్లు. ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో మనకు మరింత దగ్గరై రైలు ప్రయాణం మన జీవనశైలిలో భాగంగా మారిపోయింది. ఇలా రైళ్ళు వాటి సేవలను ప్రజలకు అందిస్తున్నాయి.

Updated Date - 2023-06-13T13:27:23+05:30 IST