నాటి రోజుల్లోనే భారతఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆ 3 విశ్వవిద్యాలయాలు... అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉండేదంటే...
ABN , First Publish Date - 2023-04-22T06:54:51+05:30 IST
భారతదేశంలోని టాప్ 3 విశ్వవిద్యాలయాలు(Universities) ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ విశ్వవిద్యాలయాలలో
భారతదేశంలోని టాప్ 3 విశ్వవిద్యాలయాలు(Universities) ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ విశ్వవిద్యాలయాలలో వేద విద్యతో పాటు ఇతర సబ్జెక్టుల అధ్యయనం(study), పరిశోధనలు జరిగేది. ఆ యూనివర్శిటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నలంద విశ్వవిద్యాలయం
నలంద విశ్వవిద్యాలయం(Nalanda University) పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది 450-470 ఏడీలో స్థాపితమయ్యింది, ఆ సమయంలో మనదేశం నుండి మాత్రమే కాకుండా జపాన్, చైనా, టర్కీ, ఇండోనేషియా(Indonesia) తదితర దేశాల విద్యార్థులు ఇక్కడకి చదువుకోవడానికి వచ్చేవారు. అప్పట్లో 10 వేలకు పైగా విద్యార్థులు చదువుకున్నారు. ఇక్కడ 9 అంతస్తుల లైబ్రరీ కూడా ఉండేది. ఈ యూనివర్సిటీలో ప్రవేశం పొందడం అంత సులభమైన పని కాదు. అప్పట్లో ఇక్కడ అడ్మిషన్(Admission) కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి వచ్చేది. ఇక్కడి విద్యార్థులకు ఉచిత విద్యను అందించారు. సాహిత్యం, జ్యోతిష్యం, మనస్తత్వశాస్త్రం, న్యాయశాస్త్రం, ఖగోళశాస్త్రం(Astronomy), సైన్స్, చరిత్ర, గణితం, ఆర్కిటెక్ట్ వంటి అన్ని సబ్జెక్టులను ఇక్కడ బోధించేవారు.
తక్షశిల విశ్వవిద్యాలయం
తక్షశిల విశ్వవిద్యాలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని పురాతన విశ్వవిద్యాలయాలలో(ancient universities) ఒకటి. అయితే భారత్-పాకిస్తాన్ విభజన తర్వాత ఈ యూనివర్సిటీ పాకిస్తాన్‌కు వెళ్లిపోయింది. సుమారు 27 వేల సంవత్సరాల క్రితం ఈ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు వచ్చేవారు. ఆయుర్వేదం(Ayurveda), నీతిశాస్త్రం తదితర సబ్జెక్టులను ఈ యూనివర్సిటీలో బోధించేవారు.
విక్రమశిల విశ్వవిద్యాలయం
నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల తర్వాత విక్రమశిల విశ్వవిద్యాలయం(Vikramsila University) పేరు వినిపిస్తుంది. విక్రమశిల విశ్వవిద్యాలయం బీహార్‌లో ఉంది. ఇక్కడ కూడా మిగతా రెండు యూనివర్సిటీల మాదిరిగానే విదేశాల నుంచి విద్యార్థులు చదువుకునేందుకు వచ్చేవారు. నేటికీ విక్రమశిల విశ్వవిద్యాలయం నిర్మాణం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఒక ప్రధాన పర్యాటక కేంద్రం(Tourist center)గా మారింది.