Richest YouTuber: బాబోయ్.. యూట్యూబ్ చానెల్‌తో ఇంత సంపాదనా..? నెలకు కోటి ఆదాయం.. దుబాయిలో రూ.60 కోట్ల ఇల్లు..!
ABN , First Publish Date - 2023-09-06T17:51:25+05:30 IST
ప్రస్తుతం డిజిటల్ మీడియాదే హవా. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు.. సంపాదించుకునే అవకాశాలు కూడా పెరిగాయి. ఈ డిజిటల్ యుగంలో డబ్బు సంపాదించాలంటే ఎండలో చెమటలు చిందించాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చునే కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు
ప్రస్తుతం డిజిటల్ మీడియాదే హవా. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు.. సంపాదించుకునే అవకాశాలు కూడా పెరిగాయి. ఈ డిజిటల్ యుగంలో డబ్బు సంపాదించాలంటే ఎండలో చెమటలు చిందించాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చునే కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా టెక్నాలజీ మీద పట్టు. కొత్తగా ఆలోచించడానికి అవసరమయ్యే సృజనాత్మకత. ప్రస్తుతం ఎంతో మంది యూట్యూబ్ (YouTube), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు.
యూట్యూబ్ ద్వారా భారీగా ఆర్జిస్తున్న వ్యక్తిగా గౌరవ్ చౌదరి (Gaurav Choudhary) నిలిచాడు. అతి తక్కువ సమయంలో యూట్యూబ్ నుండి కోట్లాది రూపాయలు సంపాదించాడు. రాజస్థాన్ (Rajasthan)లోని అజ్మీర్ జిల్లాకు చెందిన గౌరవ్ కేవలం కొన్ని సంవత్సరాల్లో ఏకంగా రూ.360 కోట్లు సంపాదించాడు. అతను ``టెక్నికల్ గురూజీ`` (Technical Guruji) పేరుతో యూట్యూబ్‌లో తన స్వంత ఛానెల్‌ని నడుపుతున్నాడు. ఈ ఛానెల్‌లో, అతను కొత్త సాంకేతిక ఆవిష్కరణల గురించి చెబుతాడు. ఈ ఛానెల్‌ను 2.3 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. 2015లో గౌరవ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. ఈ ఛానెల్ సూపర్ సక్సెస్ అయి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.
Success Story: ఎవరీ దంపతులు..? ఒకప్పుడు భార్య సంపాదన మీదే ఆధారపడిన భర్త.. ఇప్పుడు ఏకంగా రూ.19 వేల కోట్ల ఆస్తి..!
అజ్మీర్‌లోని ఓ వ్యాపార కుటుంబంలో జన్మించిన గౌరవ్‌కు చిన్నప్పట్నుంచి టెక్నికల్ అంశాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే అతడికి కోట్లు సంపాదించి పెడుతోంది. ఏ వ్యాపారవేత్త కూడా సంపాదించలేనంత వేగంతో గౌరవ్ కోట్లు సంపాదించాడు. గౌరవ్ మొత్తం సంపాదన రూ.360 కోట్లు. అతడికి దుబాయ్‌లో రూ.60 కోట్లు విలువ చేసి బంగ్లా ఉంది. దీంతో పాటు రూ.20 కోట్ల విలువైన పలు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.