Ola Company: 12 ఏళ్ల క్రితం ఆయనకు జరిగిన అవమానమే.. ఓలా కంపెనీ పుట్టుకకు కారణం.. ఓలా డ్రైవర్లకూ తెలీని నిజాలివీ..!

ABN , First Publish Date - 2023-07-08T15:58:13+05:30 IST

ఒక్కోసారి ఓ చిన్న ఘటన మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది.. మనకెదురైన ఓ చిన్న సమస్య గొప్ప భవిష్యత్తుకు పునాది వేస్తుంది.. ఆ సమస్యను పరిష్కారించే క్రమంలో గొప్ప ఆలోచన పుడుతుంది.. ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తుంది.. ప్రస్తుతం వేల కోట్ల కంపెనీగా మారిన ``ఓలా`` వెనుక అలాంటి కథే ఉంది..

Ola Company: 12 ఏళ్ల క్రితం ఆయనకు జరిగిన అవమానమే.. ఓలా కంపెనీ పుట్టుకకు కారణం.. ఓలా డ్రైవర్లకూ తెలీని నిజాలివీ..!

ఒక్కోసారి ఓ చిన్న ఘటన మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది.. మనకెదురైన ఓ చిన్న సమస్య గొప్ప భవిష్యత్తుకు పునాది వేస్తుంది.. ఆ సమస్యను పరిష్కారించే క్రమంలో గొప్ప ఆలోచన పుడుతుంది.. ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తుంది.. ప్రస్తుతం వేల కోట్ల కంపెనీగా మారిన ``ఓలా`` (Ola) వెనుక అలాంటి కథే ఉంది.. భవిష్ అగర్వాల్ (Bhavish Aggarwal) అనే కుర్రాడు ఎన్నో అవమానాలను, సమస్యలను ఎదుర్కొని పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి ``ఓలా``కు అంతటి గుర్తింపు తీసుకొచ్చాడు (Success Story).

పంజాబ్‌ (Punjab)లోని లూథియానాకు చెందిన భవిష్ 2008లో ఐఐటీ ముంబై నుంచి కంప్యూటర్స్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియాలో ఇంటెర్న్‌గా తన కెరీర్ ప్రారంభించి రెండేళ్లు అక్కడ పని చేశారు. ఆ తర్వాత భవిష్ ఒకసారి తన స్నేహితులతో కలిసి బెంగళూరు నుంచి బందీపూర్ వరకు ట్యాక్సీ బుక్ చేసుకున్నాడు. అయితే ట్యాక్సీ డ్రైవర్ మైసూర్‌లో తన కారును ఆపేశాడు. తనకు ప్రయాణ ఖర్చులు సరిపోవని, ముందు అనుకున్న దాని కంటే ఎక్కువ చెల్లించాలని అడిగాడు. అందుకు భవిష్ అంగీకరించలేదు. దీంతో ఆ డ్రైవర్ భవిష్‌ను, అతడి స్నేహితులను మైసూర్‌లోనే దించేసి వెళ్లిపోయాడు.

Multiple Bank Accounts: ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే నష్టం ఏముంటుందిలే అనుకుంటున్నారేమో.. ఈ విషయాలు తెలిస్తే..!

డ్రైవర్ అలా చేయడం భవిష్‌ను ఆలోచనలో పడేసింది. చాలా మంది ఇలాంటి సమస్యనే ఎదుర్కొని ఉంటారని, దీనికి పరిష్కారం కనుగొనాలని అనుకున్నాడు. ఆ సమస్యకు పరిష్కారంగానే ఓలా (Ola Cabs) పుట్టుకొచ్చింది. అద్దె కార్ల ఐడియాకు, టెక్నాలజీ జోడించి తన స్నేహితుడు అంకిత్ భాటి (Ankit Bhati)తో కలిసి ``ఓలా``ను 2011లో ప్రారంభించాడు. క్యాబ్ డ్రైవర్లకు, ప్రయాణికులకు మధ్య అనుసంధానకర్తలా ఓలా పని చేస్తుంది. మొదట్లో భవిష్ ఐడియాను కుటుంబ సభ్యులు కూడా ఆమోదించలేదు. అయినా అతడు వెనకడుగు వేయలేదు. ప్రస్తుతం ఓలా ద్వారా 1.5 కోట్ల మంది డ్రైవర్లు ఉపాధి పొందుతున్నారు. దేశంలో 100 ప్రధాన నగరాల్లో ఓలా సంస్థ తన సేవలందిస్తోంది.

Updated Date - 2023-07-08T15:58:13+05:30 IST