lions commit suicide: వేటాడలేని వృద్ధాప్య దశలో సింహం ఆత్మహత్య చేసుకుంటుందా? చాలామంది చేసే ఈ వాదనలో నిజం ఎంతంటే...

ABN , First Publish Date - 2023-03-25T07:55:55+05:30 IST

lions commit suicide: సింహం వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు అది వేటాడదని, పైగా అలాంటి దుర్భర పరిస్థితి(miserable situation)లో ఆత్మహత్య చేసుకుంటుందని చాలామంది చెబుతుంటారు.

lions commit suicide: వేటాడలేని వృద్ధాప్య దశలో సింహం ఆత్మహత్య చేసుకుంటుందా? చాలామంది చేసే ఈ వాదనలో నిజం ఎంతంటే...

lions commit suicide: సింహం వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు అది వేటాడదని, పైగా అలాంటి దుర్భర పరిస్థితి(miserable situation)లో ఆత్మహత్య చేసుకుంటుందని చాలామంది చెబుతుంటారు. ఇలా భావించడం వెనుక చాలా కారణాలున్నాయి. సింహం జీవిత కాలం(life span) 25 ఏళ్లు.. అయితే అది 12 ఏళ్ల వయసులో బలహీనం(weak)గా మారుతుంది. అంటే సింహం వృద్ధాప్యంనకు చేరుకున్నదని అంటారు.

యవ్వనం(youth)లో సింహం తనకు కావలసిన జంతువులను వేటాడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో అది ఎంతో శక్తి, చురుకుదనం(Agility) కలిగి ఉంటుంది. వృద్ధాప్యదశలో దానికి శక్తి, చురుకుదనం తగ్గుతుంది. దీంతో అది వేగంగా పరుగెత్తలేక(unable to run) చిన్నాచితకా జంతువులను వేటాడుతుంది. కాలక్రమేణా సింహం మరింత బలహీనంగా మారుతుంది. ఈ నేపధ్యంలో ఆ సింహం ఉంటున్న ప్రాంతాన్ని ఇతర సింహాలు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తాయి.

ఇందుకు జరిగే పోరాటంలో వృద్ధ సింహం(old lion) తీవ్రంగా గాయపడి, ఆ గాయాల కారణంగా అది చనిపోతుంది. అయితే మగ సింహం(male lion) ఎప్పుడూ ఆహారం కోసం వేటాడదు. 90% వేటను ఆడ సింహాలే చేస్తాయి. మగ సింహం ఆడ సింహాలను ఇతర జంతువుల నుండి రక్షిస్తుంది. అవి అడవిలో సంచరిస్తున్నప్పుడు ఎంత భూభాగం(Territory)లో పరిపాలించాలో నిర్థారించుకుంటాయి. అయితే వృద్ధాప్యంలో సింహం ఆత్మహత్య(suicide) చేసుకుంటుందనడంలో వాస్తవం లేని పరిశోధకులు(Researchers) పేర్కొన్నారు.

Updated Date - 2023-03-25T11:02:12+05:30 IST