Aadhaar Card QR Code: ఆధార్ కార్డుపై ఏమాత్రం అర్థం కాకుండా ఉండే ఈ క్యూఆర్ కోడ్‌లో ఇంత మేటర్ ఉంటుందా..?
ABN , First Publish Date - 2023-02-24T19:36:19+05:30 IST
ప్రస్తుతం మనదేశంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆధార్ కార్డు (Aadhaar Card) తప్పనిసరి. ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ ఎవరూ పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఆ క్యూఆర్ కోడ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ప్రస్తుతం మనదేశంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆధార్ కార్డు (Aadhaar Card) తప్పనిసరి. ఆధార్ కార్డు లేకపోతే ఏ పనీ అవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే చాలా పథకాలు మనకు అందాలంటే ఆధార్ కచ్చితంగా కావాల్సిందే. ఆధార్ కార్డులో ఓ వ్యక్తికి సంబంధించిన చాలా వివరాలు ఉంటాయి. ఆ వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి ముఖ్యమైన వివరాలు అన్నీ కనిపిస్తాయి. వాటితో పాటు ఆధార్ కార్డుపై ఓ క్యూఆర్ కోడ్ (Aadhaar QR Code) కూడా ఉంటుంది. ఆధార్ కార్డుపై ఉన్న కోడ్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అసలు ఆ క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది అని కూడా ఎవరూ ఆలోచించరు. నిజానికి ఆ క్యూఆర్ కోడ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
* మొదటిది ఆ ఆధార్ కార్డు అసలుదా? నకిలీదా? (Fake Aadhar Cards) అని క్యూఆర్ కోడ్ ఆధారంగా కనిపెట్టవచ్చు. ఆధార్ కార్డ్‌లో ఏదైనా మోసం ఉన్నట్టు అనుమానం వస్తే దానిని QR కోడ్ స్కానర్ ఉపయోగించి సులభంగా గుర్తించవచ్చు.
* QR కోడ్ అనేది UIDAI (Unique Identification Authority of India) ప్రారంభించిన కాగిత రహిత e-KYC సిస్టమ్‌లో ప్రధాన భాగం. ఓ వ్యక్తి తన ఆధార్ కార్డ్‌ను పలు పనుల కోసం స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు. వారు తమ ఆధార్ డేటా భద్రత విషయంలో ఎలాంటి అనుమానానాలు పెట్టుకోవనవసరం లేదు.
* QR కోడ్‌లో ఆధార్ కార్డు హోల్డర్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలు, ఫొటోతో పాటు UIDAI డిజిటల్ సంతకం కూడా ఉంటుంది.
* ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ క్షణమైనా ఆఫ్‌లైన్‌లోనే ఆధార్ ఐడెంటినీ వెరిఫై చేసుకోవడానికి ఆధార్ క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుంది. ఆధార్ క్యూఆర్ కోడ్ స్కానర్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఈ సేవలు పొందొచ్చు.
* ఆధార్ కార్డులో ఫోటోను మార్చారా? ఇతర వివరాలను కూడా ఎడిట్ చేశారా? అనేది తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ (QR Code Scan) చేసి ఆధార్ వివరాలను వెరిఫై చేసి, అందులోని వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోవచ్చు.