Thailand Tour: థాయ్‌లాండ్ వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మీకోసం IRCTC థ్రిల్లింగ్ ప్యాకేజీ..వివరాలివే..!

ABN , First Publish Date - 2023-04-05T17:03:27+05:30 IST

సాధారణంగా మనం ఎక్కడైనా విహారయాత్రకు వెళ్లాలంటే.. యాత్ర స్థలాలను ఎంపిక చేసుకోవడం, ప్రయాణం..

Thailand Tour: థాయ్‌లాండ్ వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మీకోసం IRCTC థ్రిల్లింగ్ ప్యాకేజీ..వివరాలివే..!

సాధారణంగా మనం ఎక్కడైనా విహారయాత్రకు వెళ్లాలంటే.. యాత్ర స్థలాలను ఎంపిక చేసుకోవడం, ప్రయాణం, హోటళ్ల బుకింగ్ వంటివి మన ముందుంటే సవాళ్లు.. వీటన్నింటిని దృష్టిల్లో పెట్టుకొని ఇండియన్ రైల్వే కు చెందిన IRCTC ప్రత్యేక ప్యాకేజీలను ఇప్పుడు విదేశాల్లో విహార యాత్రకు ఇండియన్ ట్రావెలర్స్(Indian travellers) కు ప్రకటించింది. తాజాగా థాయ్‌లాండ్‌లో విహార యాత్రకు వెళ్లేందుకు థాయ్‌లాండ్ థ్రిల్లింగ్ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేసింది.

థాయ్‌లాండ్ విహార యాత్రకు IRCTC ఓ సదావకాశాన్ని భారతీయ యాత్రికుల ముందుంచింది. స్నేహితులతో కలిసి ఏప్రిల్ నెల థాయ్‌లాండ్‌లో విహారయాత్ర చేస్తే ఆహ్లాదంగా ఉంటుంది. IRCTC థ్రిల్లింగ్ థాయ్‌లాండ్ ప్యాకేజీ మీ విహార యాత్రలో మరింత ఉత్సాహం నింపుతుందంటున్నారు ప్యాకేజీ నిర్వాహకులు. ఏప్రిల్ 25 ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ ప్రారంభమవుతుంది. ప్రారంభ ప్యాకేజీలో భాగంగా 5 రాత్రులు, 6 పగలు థాయ్‌లో విహరించవచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా బ్యాంకాక్(Bangkok), పట్టాయ(Pattaya) వంటి వివిధ విహార యాత్రా స్థలాల్లో చూసే అవకాశం IRCTC కల్పిస్తోంది. మరొక అడ్వాంటేజీ ఏంటంటే..ఈ ప్యాకేజీలో భాగంగా రుచికరమైన ఆల్పాహారం,రాత్రి భోజనం IRCTC అందిస్తోంది.

థ్రిల్లింగ్ థాయ్‌లాండ్ ప్యాకేజీ యాత్ర కొనసాగుతుందిలా..

బీహార్‌లోని పాట్నా ఎయిర్ పోర్టు నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. మరుసటి రోజు బ్యాంకాక్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మొదట కొట్టాయం చేరుకుంటారు. కొట్టాయంలో ముందుగానే బుక్ చేసిన హోటళ్ల బ్రేక్‌పాస్ట్ చేసి విశ్రాంతి తీసుకుంటారు. అదే రోజు సాయంత్రం అల్కజార్ షోను విక్షించి.. రాత్రి డిన్నర్ ఆ హోటళ్లోనే ముగించి రాత్రి అక్కడే గడుపుతారు.

మూడో రోజు బ్రేక్‌పాస్ట్ తర్వాత బోట్‌లో కోరస్ ఐస్‌లాండ్‌కు చేరుకుంటారు. అక్కడ బీచ్‌లో మీకోసం వివిధ రకాల ప్రొగ్రామ్స్‌ ఏర్పాటు చేస్తారు. కొంత సమయం అక్కడ గడిపిన తర్వాత తిరిగి కొట్టాయం చేరుకుంటారు. రాత్రి భోజనం అనంతరం కేటాయించిన హోటళ్లో మీరు గడుపుతారు.

నాలుగో రోజు అల్పాహారం తీసుకున్న తర్వాత సఫారీ వరల్డ్ పర్యటనకు తీసుకెళ్తారు. ఆ రోజు మొత్తం అక్కడి గడిపిన తర్వాత మిమ్మల్ని తిరిగి బ్యాంకాక్ చేరుకుంటారు.

ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం వరకు బ్యాంకాక్ సిటీని సందర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రముఖ ఇండియన్ రెస్టారెంట్లలో లంచ్ ఏర్పాటు చేస్తారు.

ఆరో రోజు అర్ధరాత్రి అనగా 30 తేదీన విమానంలో బ్యాంకాక్‌నుంచి బయల్దేరి ఉదయం 8 గంటలకు పట్నా చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.

మే 26న కోల్‌కతా నుంచి ప్రారంభమయ్యే టూర్‌ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. తేదీలు మాత్రం మారతాయి. అలాగే ఛార్జీల్లోనూ మార్పులున్నాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఆ వివరాలను చూడొచ్చు.

ప్యాకేజ్‌ ఛార్జీల వివరాలు

  • ఒక్కరు మాత్రమే బుక్‌ చేసుకుంటే రూ.60,010

  • ఇద్దరు లేదా ముగ్గురు కలిసి రిజర్వ్‌ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.52,350

  • 5-11 సంవత్సరాల చైల్డ్‌కు ప్రత్యేకంగా బెడ్‌ కావాలంటే ఒకరికి రూ.50,450

  • 5-11 సంవత్సరాల చైల్డ్‌కు ప్రత్యేకంగా బెడ్‌ వద్దనుకుంటే ఒకరికి రూ.45,710

Updated Date - 2023-04-05T17:08:17+05:30 IST