Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఎఫెక్ట్.. టీవీ నుంచి వాషింగ్ మెషీన్ల వరకు.. వేటి ధరలు పెరగబోతున్నాయంటే..!
ABN , First Publish Date - 2023-10-18T14:55:40+05:30 IST
ప్రస్తుతం ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రపంచ దేశాలను తీవ్రంగా కలతపెడుతోంది. ఈ యుద్ధం ప్రభావం ప్రపంచలోని చాలా దేశాల మీద పడనుంది. ముఖ్యంగా చాలా దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరగబోతున్నాయి.
ప్రస్తుతం ఇజ్రాయెల్ (Israel), పాలస్తీనా (Palestine) మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ యుద్ధం (Israel-Hamas war) ప్రభావం ప్రపంచంలోని చాలా దేశాల మీద పడనుంది. ముఖ్యంగా చాలా దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. ఈ యుద్ధంలో కనుక ఇరాన్ (Iran), లెబనాన్ వంటి దేశాలు కూడా చేరితే భారత్‌లో ద్రవ్యోల్బణం (Inflation) భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం మొదలైన వారం రోజుల్లోనే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి (War Impact on India).
ఈ యుద్ధం ఎన్ని రోజులు జరిగితే ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. ద్రవ్యోల్భణం అదుపు తప్పుతుంది. ఈ యుద్ధం వల్ల భారత్ (India) కూడా ప్రభావితమవుతుంది. రానున్న కాలంలో ముడి చమురు (Crude oil ) ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో పెట్రోల్‌పై ఆధారపడిన అన్ని ఉత్పత్తుల ధరలు పెరగవవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ టీవీ, వాషింగ్ మెషీన్‌తో సహా అనేక ఉత్పత్తుల ధరలు పెరగబోతున్నాయి. అలాగే పెట్రోల్ ధరల పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్భణం కూడా పెరుగుతుంది. అంటే అన్ని నిత్యావసర ధరలు గణనీయంగా పెరుగుతాయి.
Bride: పెళ్లయిన 4వ రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నవ వధువు.. అసలు నిజం తెలిసి అవాక్కైన భర్త, అత్తమామలు..!
ముఖ్యంగా ఈ యుద్ధంలో ఇరాన్ కనుక జోక్యం చేసుకుంటే భారత్ బాగా నష్టపోతుంది. ఎందుకంటే ఇరాన్ నుంచి భారత్ భారీగా క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి నిలిచిపోతే డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, రవాణా మీద ఆధారపడిన అన్ని వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. అలాగే ఎరువుల ధరలు కూడా భారీగా పెరుగుతాయి