Viral: టీ తాగడానికి టీచర్‌ను ఇంటికి పిలిచిన మహిళ.. అతడి ఎదురుగానే బట్టలు తీసేసి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-08-20T15:36:41+05:30 IST

అతను ఒక టీచర్.. జైపూర్‌లోని ఓ ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు.. కొద్ది రోజుల క్రితం అదే అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో ఉంటున్న మహిళతో పరిచయం ఏర్పడింది.. కొన్ని రోజుల క్రితం ఆమె ఆ టీచర్‌ను తన ఇంటికి ఆహ్వానించింది.. టీ తాగడానికి పిలిచింది.. అలా వెళ్లడమే ఆ టీచర్ పొరపాటైంది.

Viral: టీ తాగడానికి టీచర్‌ను ఇంటికి పిలిచిన మహిళ.. అతడి ఎదురుగానే బట్టలు తీసేసి ఏం చేసిందంటే..

అతను ఒక టీచర్.. 55 ఏళ్ల వయసు.. జైపూర్‌ (Jaipur)లోని ఓ ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు.. కొద్ది రోజుల క్రితం అదే అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో ఉంటున్న మహిళతో పరిచయం ఏర్పడింది.. అప్పుడప్పుడు ఆమె మాట్లాడుతుండేది.. కొన్ని రోజుల క్రితం ఆమె ఆ టీచర్‌ను తన ఇంటికి ఆహ్వానించింది.. టీ తాగడానికి పిలిచింది.. అలా వెళ్లడమే ఆ టీచర్ పొరపాటైంది.. చివరకు పోలీసులను ఆశ్రయించవలసి వచ్చింది (Rajasthan Crime News).

ప్రతాప్‌నగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాజేష్ (52) అనే ఉపాధ్యాయుడు నివసిస్తున్నాడు. అదే అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో ఉంటున్న మహిళతో పరిచయం ఏర్పడింది. ఎదురుపడినప్పుడల్లా ఆమె రాజేష్‌తో మాటలు కలిపేది. కొన్ని రోజుల క్రితం ఆమె ఆ టీచర్‌ను తన ఇంటికి ఆహ్వానించింది. టీ తాగడానికి పిలిచింది. దీంతో రాజేష్ ఆమె ఫ్లాట్‌కు వెళ్లాడు. రాజేష్‌కు టీ ఇచ్చిన మహిళ అతడి ఎదురుగానే బట్టలు విప్పేసి గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. వెంటనే లోపలి నుంచి ఐదుగురు దుండగులు బయటకు వచ్చి రాజేష్‌ను బెదిరించారు (Black Mail). రాజేష్‌ను, నగ్నంగా ఉన్న మహిళను కలిపి వీడియో తీశారు.

Shocking: స్నేహితుడే కదా అని నమ్మి వెళ్తే దారుణం.. కశ్మీర్‌కు తీసుకెళ్లి ఆరు రోజుల పాటు నరకం.. ఆ తర్వాత ఎలా బెదిరించాడంటే..

తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతామని బెదిరించారు. భయపడిన రాజేష్ అప్పటికప్పుడే రూ.55 వేలు ఫోన్ పే చేశాడు. ఆ తర్వాత మరో రూ.78 వేలు ఇచ్చాడు. అయినా దుండగులు ఊరుకోలేదు. తమకు రూ.15 లక్షలు ఇవ్వాలని, లేకపోతే పోలీసులను ఆశ్రయించి అత్యాచారం కేసు పెడతామని బెదిరించారు. దీంతో రాజేష్ నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు దుండగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2023-08-20T15:36:41+05:30 IST