Viral News: మొదటి చూపులోనే ‘శోభనం’ దాకా.. తీరా ఫస్ట్ డేట్ వచ్చేసరికి మైండ్‌బ్లోయింగ్ షాక్.. ఏమైందంటే?
ABN , First Publish Date - 2023-08-14T20:13:40+05:30 IST
తమ జీవితంలోకి రాబోయే భాగస్వామిపై అమ్మాయిలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తమ ఇష్టాలను గౌరవించడంతో పాటు సుఖ దుఃఖాలలో తోడుగా ఉండేవాడు రావాలని కోరుకుంటారు. చూడ్డానికి...
తమ జీవితంలోకి రాబోయే భాగస్వామిపై అమ్మాయిలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తమ ఇష్టాలను గౌరవించడంతో పాటు సుఖ దుఃఖాలలో తోడుగా ఉండేవాడు రావాలని కోరుకుంటారు. చూడ్డానికి హ్యాండ్సమ్‌గా ఉండటంతో పాటు మంచి గుణాలు కలిగిన వాడై ఉండాలని ఆశిస్తారు. తన జీవితంలోనూ అలాంటి అబ్బాయే వస్తాడని ఓ యువతి ఎన్నో కలలు కంది. చివరికి ఓ అబ్బాయి ఆమె జీవితంలోకి రానే వచ్చాడు. దీంతో.. తన జీవితం మరో మలుపు తీసుకోబోతోందని, తాను కోరుకున్నట్టే భాగస్వామి దొరికాడని భావించింది. తీరా ఫస్ట్ డేట్ సమయం వచ్చినప్పుడు.. ఆమెకి ఊహించని షాక్ తగిలింది. దీంతో.. ఆమె కలలన్నీ చెల్లాచెదురయ్యాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆ యువతి పేరు జానా హాకింగ్. ఈమె ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. చాలాకాలం నుంచి ఒంటరిగా ఉంటున్న ఈ యువతి.. మొదటి చూపులోనే ఒక అబ్బాయిని చూసి ప్రేమలో పడింది. అందగాడు కావడం, తన పట్ల చాలా గౌరవంగా ప్రవర్తించడం చూసి.. అతనికి ఆమె ఫిదా అయిపోయింది. తాను కోరుకున్న లక్షణాలు అతనిలో దాదాపు కనిపించడంతో.. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతేకాదు.. హనీమూన్ దాకా పక్కా ప్లానింగ్ వేసుకుంది కూడా! కొన్ని రోజుల పాటు వీరి ప్రేమాయణం సజావుగా సాగింది. ఫైనల్‌గా.. తమ మొదటి డేట్‌కి ప్లాన్ వేసుకున్నారు. ఇందుకు జానా హాకింగ్స్ గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసుకుంది. కానీ.. చివరి నిమిషానిక తనే స్వయంగా డేట్ రద్దు చేసుకుంది. ఇందుకు కారణం.. ఆ అబ్బాయికి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు తెలియడమే!
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరికీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో తమకంటూ ఒక ఖాతా ఉంటుంది. కానీ.. జానా ప్రేమించిన యుడకుడికి ఏ ఒక్క అకౌంట్ లేదు. అలాగే.. అతడు తన తల్లిదండ్రులతో కలిసి ఉండటం లేదన్న విషయం కూడా జానాకి తెలిసింది. తానేమో కుటుంబాన్ని గౌరవించే యువకుడు కోసం చూస్తుంటే.. ప్రేమించిన అబ్బాయేమో ఫ్యామిలీకే దూరంగా ఉండటం ఆమెకి నచ్చలేదు. దీనికితోడు.. అతడు డేట్‌కి వెళ్లడానికి ముందు వాట్సాప్‌లో జానా నంబర్‌ని బ్లాక్ చేశాడు. ఇవన్నీ తేడాగా అనిపించడంతో.. ఆ అబ్బాయితో డేట్‌కి వెళ్లడం కన్నా రద్దు చేసుకోవడమే నయమని భావించి, అతనికి బ్రేకప్ చెప్పేసింది జానా హాకింగ్స్.