మరో జంతువును చూస్తే చాలు చెలరేగిపోయే అటవీ జంతువులు జంగల్ సఫారీపై ఎందుకు దాడి చేయవంటే..
ABN , First Publish Date - 2023-03-25T12:21:46+05:30 IST
మన దేశంలోని జాతీయ పార్కులలో జంగల్ సఫారీ(Jungle Safari) సదుపాయం ఉంటుంది. వీటిలో ప్రయాణించే పర్యాటకులను అటవీ జంతువులు(Forest animals) ఏమీ చేయవు.
మన దేశంలోని జాతీయ పార్కులలో జంగల్ సఫారీ(Jungle Safari) సదుపాయం ఉంటుంది. వీటిలో ప్రయాణించే పర్యాటకులను అటవీ జంతువులు(Forest animals) ఏమీ చేయవు. దీనికి కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అటవీ జంతువులు ఈ సఫారీ వాహనాన్ని పెద్ద వస్తువుగా లేదా పెద్ద జంతువుగా భావిస్తాయి. సింహాలు(lions) లేదా పులులు ఈ వాహనాలను తమ కుటుంబంలో సభ్యునిగా చూస్తాయి.
అయితే వాహనంలోని వారెవరరైనా బయటకు తొంగి చూసినప్పుడు, లేదా చేతులు బయటకు పెట్టినప్పుడు బయటి జంతువులు వారిపై దాడి(attack) చేస్తాయి. అందుకే సింహం లేదా మరేదైనా జంతువు సఫారీ వాహనానికి దగ్గరగా వచ్చినప్పుడు దానిలోని పర్యాటకులు(Tourists) భయాందోళనలకు గురికావద్దని అధికారులు సూచిస్తుంటారు. జంతువులు సాధారణంగా కదలికతో ఉన్న జంతువులను మాత్రమే వేటాడతాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనం(National Park)గా తీర్చిదిద్ది, పర్యాటకుల కోసం దానిని తెరవడానికి ముందు అధికారులు కొన్ని సన్నాహాలు చేస్తారు. జంతువుల ప్రవర్తనను తెలుసుకోవడానికి, వాటి సమీపంలో సఫారీ వాహనాలను నడుపుతారు. మొదట్లో జంతువులు దూకుడుగా ప్రవర్తిస్తాయి. కానీ కాలక్రమేణా అవి ఆ వాహనాలకు అలవాటుపడతాయి. ఆ తర్వాత అవి సఫారీ వాహనాలను(Safari vehicles) హానికారకంగా చూడవు.