చాట్ జీపీటీ రాకతో వీరి ఉద్యోగాలకు పెను ముప్పు... ఈ జాబితాలో మీరున్నారేమో చెక్ చేసుకోండి!
ABN , First Publish Date - 2023-03-29T08:02:19+05:30 IST
చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) ఆధారిత చాట్‌బాట్. దీనిలో పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న మొత్తం డేటా వెల్లడవుతుంది.
చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) ఆధారిత చాట్‌బాట్. దీనిలో పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న మొత్తం డేటా వెల్లడవుతుంది. ఈ చాట్‌బాట్ కవితలు, కథలు(Stories), ఈ మెయిల్ మొదలైన అనేక రకాల పనులను సెకన్ల వ్యవధి(duration of seconds)లో చేస్తుంది. Open AI ఇటీవలే GPT 4, Chat GPTల కొత్త వెర్షన్‌ను ప్రారంభించింది. కొత్త వెర్షన్(New version) మునుపటి కంటే మరింత అధునాతనమైనది. ఖచ్చితమైన(Accurate) ఫలితాలను అందిస్తోంది. దీనిలో యూజర్లు(users) ఫోటోల ద్వారా కూడా తమకు కావలసిన వివరాలు శోధించవచ్చు. ఇటీవల ఓపెన్ రీసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా(University of Pennsylvania) ఒక నివేదికను ప్రచురించింది. అందులో AI వల్ల ఎవరి ఉద్యోగాలకు ముప్పు వాటిల్లనుంది? ఏఐ వచ్చినా ఎవరు నిర్భయంగా ఉండవచ్చో తెలియజేశారు. ఆ జాబితా ఇదే..
AIతో ఈ ఉద్యోగాలు ప్రభావితం కావు
ఫలహారశాల అటెండెంట్లు(Cafeteria Attendants)
బారులో సర్వర్లు(Bartenders)
పాత్రలు తోమేవారు(Dishwashers)
ఎలక్ట్రికల్ పవర్-లైన్ ఇన్‌స్టాలర్లు(Electrical Power-Line Installers and Repairers)
వడ్రంగులు(Carpenters)
పెయింటర్లు(Painters)
ప్లంబర్లు(Plumbers)
మాంసం, పౌల్ట్రీ, ఫిష్ కట్టర్లు, ట్రిమ్మర్లు(Meat, Poultry, and Fish Cutters and Trimmers)
స్లాటర్లు, మాంసం ప్యాకర్లు(Slaughterers and Meat Packers)
కల్లుగీతకారులు(Stonemasons)
వ్యవసాయ పరికరాల ఆపరేటర్లు(Agricultural Equipment Operators)
క్రీడాకారులు, క్రీడా పోటీదారులు(Athletes and Sports Competitors)
వాహన నిపుణులు(Auto Mechanics)
సిమెంట్ మేసన్స్(Cement Masons)
వంట చేసేవారు(Cooks)
AI కారణంగా ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉన్నవారు
కోర్టు విలేకరులు(Court Reporters)
గణిత శాస్త్రజ్ఞులు(Mathematicians)
పన్ను సిద్ధం చేసేవారు(Tax Preparers)
ఫైనాన్షియల్ క్వాంటిటేటివ్ విశ్లేషకులు(Financial Quantitative Analysts)
రచయితలు(Writers and Authors)
వెబ్, డిజిటల్ ఇంటర్‌ఫేస్ డిజైనర్లు(Web and Digital Interface Designers)
ప్రూఫ్ రీడర్లు(Proofreaders)
అకౌంటెంట్లు(Accountants)
ఆడిటర్లు(Auditors)
వార్తా విశ్లేషకులు(News Analysts)
పాత్రికేయులు(Journalists)
పరిపాలనా సహాయకులు(Administrative Assistants)