Karthi: ‘96’ డైరెక్టర్‌తో సినిమా చేయనున్న కార్తి!

ABN , First Publish Date - 2023-01-16T14:14:24+05:30 IST

కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా ‘96’. ఈ చిత్రానికీ సి. ప్రేమ్ కుమార్ (C.Prem Kumar) దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), త్రిష (Trisha) హీరో, హీరోయిన్‌గా నటించారు.

Karthi: ‘96’ డైరెక్టర్‌తో సినిమా చేయనున్న కార్తి!

కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా ‘96’. ఈ చిత్రానికీ సి. ప్రేమ్ కుమార్ (C.Prem Kumar) దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), త్రిష (Trisha) హీరో, హీరోయిన్‌గా నటించారు. 2018లో విడుదలైన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ మూవీ ఇచ్చిన కిక్‌తో ప్రేమ్‌కు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. తాజాగా అతడు స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్‌ను కొట్టేశాడని కోలీవుడ్ మీడియా వర్గాలు తెలుపుతున్నాయి.

స్టార్ హీరో కార్తి (Karthi), ప్రేమ్ కుమార్ కలసి పనిచేయనున్నారని సమాచారం అందుతుంది. కార్తి ప్రస్తుతం ‘జపాన్’ (Japan) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ప్రేమ్ కుమార్ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. సినిమాకు సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా మేకర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా తెరకెక్కనుందట. కార్తి ఈ చిత్రంలో మధురై ప్రాంతానికీ చెందిన వ్యక్తి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. మధురైలో ప్రతి సంక్రాంతికి భారీ ఎత్తున జల్లికట్టును నిర్వహిస్తారు. మూవీలో కొన్ని జల్లికట్టు సన్నివేశాలు ఉన్నాయట. అందుకోసం చిత్ర బృందం ఈ మధ్యనే మధురై ప్రాంతానికీ వెళ్లి రియల్‌గా వాటిని షూట్ చేసింది.

Updated Date - 2023-01-16T14:15:06+05:30 IST