Live In Relationship: బెడ్‌రూంలో ప్రియుడు.. కోర్టులో అన్న.. ప్రియురాలు భలే ప్లేటు తిప్పేసిందిగా!

ABN , First Publish Date - 2023-09-05T18:52:28+05:30 IST

కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాకు చెందిన విష్ణు(31) అనే వ్యక్తి 23 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అతడ్ని ప్రేమించింది. అయితే.. కుటుంబ సభ్యులు వీరి ప్రేమను...

Live In Relationship: బెడ్‌రూంలో ప్రియుడు.. కోర్టులో అన్న.. ప్రియురాలు భలే ప్లేటు తిప్పేసిందిగా!

ఈరోజుల్లో చాలామంది అమ్మాయిలు/మహిళలు తమకు అనుకూలంగా ఉన్న చట్టాలను అడ్డగోలుగా వాడేసుకుంటున్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామంటే చాలు.. ఆ చట్టాల్ని అడ్డం పెట్టుకొని, పరాయి వ్యక్తుల్ని (ముఖ్యంగా మగవారిని) బలిపశువుల్ని చేస్తున్నారు. నిజానికి.. సమస్యల్లో ఉన్న మహిళలు తమని తాము రక్షించుకోవడం కోసం ఈ చట్టాలు తీసుకొస్తే.. కొందరేమో తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడమో కోసం, ఆ తప్పుల నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు ఓ అమ్మాయి కూడా ఇదే పని చేసింది. తన స్వార్థం కోసం చివరి నిమిషంలో ప్లేటు తిప్పేసి.. తన ప్రియుడికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. పదండి.. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..


కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాకు చెందిన విష్ణు(31) అనే వ్యక్తి 23 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అతడ్ని ప్రేమించింది. అయితే.. కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఆ యువతి ఇల్లు వదిలి ప్రియుని వద్దకు వచ్చేసింది. వీళ్లిద్దరు కలిసి నెల రోజుల వరకు ఒకే ఇంట్లో సహజీవనం చేశారు. మరోవైపు.. తన కూతురు కనిపించకుండా పోయిందంటూ ఆ యువతి తండ్రి కేరళ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. తన కూతురిని విష్ణు ఎత్తుకెళ్లి, అక్రమంగా ఆమెను బంధించాడంటూ ఈ పిటిషన్‌లో ఆయన ఆరోపించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకొని, కోర్టులో ఫిర్యాదు చేసింది. తొలుత ఆ యువతి ‘విష్ణు లేనిదే నేను ఉండలేను’ అంటూ పోలీసుల ఎదుట, మీడియా ఎదుట చెప్పుకొచ్చింది.

కానీ.. కోర్టులో అడుగుపెట్టిన తర్వాత ఆ యువతి ఒక్కసారిగా ప్లేటు తిప్పేసింది. విష్ణు తనకు సోదరుడిలాంటోడని బాంబ్ పేల్చింది. తనకు తన తల్లిదండ్రులే ముఖ్యమని.. తాను కుటుంబంతో వెళ్లిపోతానని చెప్పింది. విష్ణుపై తనకు ఒక అన్నలా ఆప్యాయత ఉందే తప్ప, మరే ఇతర ఫీలింగ్స్ లేవని కుండబద్దలు కొట్టింది. దీంతో.. ఆ యువతి తన ఇష్టప్రకారం వెళ్లిపోవచ్చమని డివిజన్ బెంచ్ సూచిస్తూ, విష్ణుని మందలించింది. ప్రియురాలి షాక్‌తో ఖంగుతిన్న విష్ణు.. జస్టిస్‌ ముందు మణికట్టు కోసుకున్నాడు. పోలీసులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. మరో ట్విస్ట్ ఏమిటంటే.. విష్ణుకి ఇదివరకే పెళ్లయ్యింది. ఈ వ్యవహారం తెలిశాక.. భార్య అతడ్ని వదిలేసి వెళ్లింది.

Updated Date - 2023-09-05T18:52:28+05:30 IST