Kerala: పాపం.. ఫొటోలు తీసుకుందామని కొండ చివరకు వెళ్లిన కొత్త జంట.. రెప్ప పాటులో ఎంత ఘోరం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-07-31T17:30:11+05:30 IST

పాపం ఆ ఇద్దరికీ ఈ నెలలో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు బయల్దేరారు. పలు ప్రాంతాల్లో ఫొటోలు దిగారు. సరదాగా తిరుగుతూ సంతోషంగా గడిపారు. ఓ కొండ పై వరకు వెళ్లి ఫొటోలు తీసుకుందామనుకున్నారు. అయితే ప్రమాదవశాత్తూ కొండ శిఖరం నుంచి నదిలో పడిపోయారు..

Kerala: పాపం.. ఫొటోలు తీసుకుందామని కొండ చివరకు వెళ్లిన కొత్త జంట.. రెప్ప పాటులో ఎంత ఘోరం జరిగిందంటే..

పాపం ఆ ఇద్దరికీ ఈ నెలలో వివాహం (Marriage) జరిగింది. పెళ్లి తర్వాత స్నేహితుడితో కలిసి విహార యాత్రకు బయల్దేరారు. పలు ప్రాంతాల్లో ఫొటోలు దిగారు. సరదాగా తిరుగుతూ సంతోషంగా గడిపారు. ఓ కొండ పై వరకు వెళ్లి ఫొటోలు తీసుకుందామనుకున్నారు. అయితే ప్రమాదవశాత్తూ కొండ శిఖరం (Cliff) నుంచి నదిలో పడిపోయారు.. వారిని కాపాడడం కోసం వారి బంధువు ఒకరు నదిలోకి దూకారు. మొత్తం ముగ్గురు నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు (Crime News).

కేరళ (Kerala)లోని తిరువనంతపురంలోని కొండపై నుంచి పల్లిక్కల్ నది (Pallikkal river)లో పడి కొత్త దంపతులతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. శనివారం సాయంత్రం ఫొటోలు (Photos) తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురినీ సిద్ధిక్, నౌఫీ, అన్సిల్‌లుగా గుర్తించారు. శనివారం సాయంత్రమే అన్సిల్ మృతదేహం లభించగా, ఆదివారం నాడు కొత్త దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కొల్లం జిల్లాకు చెందిన ఈ దంపతులకు వారం రోజుల క్రితమే వివాహం జరిగింది.

Credit Card Limit: మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? లిమిట్ పెంచుకోవడం వల్ల లాభాలేంటో తెలుసా?

ఓ ఫంక్షన్ కోసం సిద్ధిక్, నౌఫీ దంపతులు శనివారం ఉదయం అన్సిల్ ఇంటికి వెళ్లారు. అనంతరం ముగ్గురూ ఫొటోలు దిగేందుకు సమీపంలోని నది వద్దకు వెళ్లారు. ఫొటోలు తీసుకుంటున్న సమయంలో దంపతులు కొండ అంచు వద్దకు వెళ్లి బ్యాలెన్స్ తప్పి కొండపై నుంచి నదిలో పడిపోయినట్లు సమాచారం. ముగ్గురి మృతదేహాలను కొల్లాం జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2023-07-31T17:30:11+05:30 IST