ఇకపై రైతుల సమస్యలకు సెకెన్లలో పరిష్కారం... అందుబాటులోకి కిసాన్ GPT... ఎలా వినియోగించాలంటే...
ABN , First Publish Date - 2023-04-16T12:02:11+05:30 IST
చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence)పై పలు పరిశోధనలు జరుగుతున్నాయి.
చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence)పై పలు పరిశోధనలు జరుగుతున్నాయి. చాట్ GPTని ఆధారంగా పలు కంపెనీలు తమ AI సాధనాలను ప్రవేశపెడుతున్నాయి. కొంతకాలం క్రితం గీతా GPT అనే టూల్ తెరపైకి వచ్చింది. దీనిలో భగవద్గీత(Bhagavad Gita) ఆధారంగా జనం తమ సందేహాలకు సమాధానాలు పొందుతున్నారు. ఇప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో సహాయపడే కిసాన్ GPT పేరుతో మరో చాట్‌బాట్ అందుబాటులోకి వచ్చింది.
కిసాన్ GPT అనేది చాట్ GPT 3.5పై ఆధారపడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) ఆధారిత చాట్‌బాట్. ఈ చాట్‌బాట్‌తో రైతులు వ్యవసాయానికి(agriculture) సంబంధించిన ఏదైనా సమస్యకు పరిష్కారం పొందవచ్చు. చాట్ GPTని మార్చి 15న ప్రతీక్ దేశాయ్ ప్రారంభించారు. ఈ చాట్‌బాట్‌ని యాక్సెస్ చేయడానికి, మీరు https://kissangpt.com/కి వెళ్లాలి. అనంతరం మీకు 14 భాషలు కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ఒక భాషను ఎంచుకోవాలి. ఆ భాషలో మాట్లాడటం ద్వారా మీ సమస్యను చాట్‌బాట్‌కు చెప్పవచ్చు.
చాట్‌బాట్ దానికి పరిష్కారాన్ని కొన్ని సెకన్ల వ్యవధిలోనే(few seconds) మీకు అందిస్తుంది. కిసాన్ GPT అనేది రైతుల కోసం రూపొందించినది. అయితే పాఠశాల విద్యార్థులు, పరిశోధకులు(Researchers) లేదా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇదేవిధంగా దీనికి సంబంధించిన యాప్ కూడా సిద్ధం అవుతోంది.