Shocking: ఏం ధైర్యమయ్యా స్వామీ.. గొంతులో కత్తిని పొడిస్తే.. బైక్‌ను స్వయంగా నడుపుకుంటూ ఆస్పత్రికి వెళ్లాడు..!
ABN , First Publish Date - 2023-06-07T15:38:04+05:30 IST
కాళ్లకో, చేతులకో చిన్న దెబ్బ తగిలితేనే చాలా మంది విలవిలలాడిపోతుంటారు. కొంచెం పెద్ద దెబ్బ అయితే స్పృహ కూడా కోల్పోతారు. అయితే నవీ ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త గొంతులో కత్తి దిగబడినా గుండె ధైర్యం కోల్పోకుండా బైక్ మీద హాస్పిటల్ వరకు వెళ్లిపోయాడు.
కాళ్లకో, చేతులకో చిన్న దెబ్బ తగిలితేనే చాలా మంది విలవిలలాడిపోతుంటారు. కొంచెం పెద్ద దెబ్బ అయితే స్పృహ కూడా కోల్పోతారు. అయితే ముంబై (Mumbai)కి చెందిన ఓ వ్యాపారవేత్త గొంతులో కత్తి (Knife) దిగబడినా గుండె ధైర్యం కోల్పోకుండా బైక్ మీద హాస్పిటల్ వరకు వెళ్లిపోయాడు. నేరుగా డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి గొంతు నుంచి కత్తిని బయటకు తీయడానికి డాక్టర్లకు నాలుగు గంటలకు పైగా పట్టింది. అతడు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లకపోతే కచ్చితంగా ప్రాణాలు పోయేవని డాక్టర్లు చెబుతున్నారు (Crime News).
నవీ ముంబైకి చెందిన వ్యాపారవేత్త తేజస్ పాటిల్‌పై అతని తమ్ముడు మోనీష్ కత్తితో దాడి చేశాడు. తన ఇంట్లో నిద్రిస్తున్న తేజస్ గొంతులో మోనీష్ కత్తి దించాడు. పదునైన కత్తి దాదాపు 60 శాతం వరకు తేజస్ గొంతులో దిగింది. వెంటనే మోనిష్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో తేజస్ స్వయంగా బైక్‌పై కిలోమీటరు దూరం ప్రయాణించి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆసుపత్రికి చేరుకున్న తేజస్‌కు వైద్యులు చికిత్స ప్రారంభించారు.
Train Accident: ఆ మృత్యుంజయుడు ఇతడే.. ఆ రోజు జరిగిందేనంటూ కొడుకును బతికించుకున్న ఆ తండ్రి చెబుతున్న మాటలివీ..!
తేజస్ గొంతులో 8x1.5 సెంటీమీటర్ల లోతున గాయమైందని డాక్టర్ తెలిపారు. కత్తిని తొలగించడానికి చాలా జాగ్రత్తగా శస్త్రచికిత్స చేయవలసి వచ్చిందని, ఏమాత్రం పొరపాటు జరిగినా సమీపంలోని నరం లేదా ధమని దెబ్బతినేదని తెలిపారు. నాలుగు గంటల సుదీర్ఘ శస్త్రచికిత్స తర్వాత అతడిని రక్షించామని, బుధవారం లేదా గురువారం డిశ్చార్జ్ కావచ్చని తెలిపారు. కాగా, మోనీష్ మద్యానికి బానిస అని, అతడు తనను ఎందుకు చంపాలనుకున్నాడో తెలియదని పోలీసులకు తేజస్ తెలిపాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న మోనీష్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.