Kiara Advani Pregnant: ముందు ప్రెగ్నెన్సీ.. తర్వాత పెళ్లి.. ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారని సెటైర్లు వేసిన కేఆర్కే

ABN , First Publish Date - 2023-02-14T11:36:34+05:30 IST

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) జంట ఒకటి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్నారు.

Kiara Advani Pregnant: ముందు ప్రెగ్నెన్సీ.. తర్వాత పెళ్లి.. ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారని సెటైర్లు వేసిన కేఆర్కే
Kiara Advani

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) జంట ఒకటి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో ఈ కపుల్ గ్రాండ్‌గా జరిగిన వివాహ వేడుకలో ఈ జంట ఒకటైంది. ఆ వేడుకకి బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం ముంబైలో రిసెప్షన్‌ని ఏర్పాటు చేసింది సిద్ కియారా జంట. అలాగే ఢిల్లీలోనూ మరోసారి అక్కడి ప్రముఖుల కోసం ఈ జంట రిసెప్షన్‌ని ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో బాలీవుడ్ నటుల మీద విమర్శలు చేసే సినీ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ (Kamaal R Khan) ఈ జంటపై కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

గతేడాది ఏప్రిల్ 14న బాలీవుడ్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండున్నర నెలలకే ఆలియా గర్భవతి అయినట్లు ఈ జంట ప్రకటించింది. తర్వాత 7 నెలలకే ఆలియా ఓ పండంటి పాపకి జన్మనిచ్చింది. ఈ తరుణంలో ఇదే ట్రెండ్‌ని కియారా, సిద్ధార్థ్ కూడా ఫాలో అయ్యారు అంటూ కేఆర్కే పరోక్షంగా సెటైర్లు వేశాడు.

ఇది కూడా చదవండి: #SidharthKiaraWedding: ‘నీకు ఆలియాతోనే రాసి పెట్టుంది’.. కొత్త జంటపై మీమ్ వైరల్

కేఆర్కే (KRK) పోస్ట్ చేసిన ట్వీట్‌లో.. ‘ముందుగా గర్భం దాల్చి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం బాలీవుడ్ కొత్త ట్రెండ్. మూలాల ప్రకారం.. బాలీవుడ్‌లో కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కూడా అదే ఫార్ములాని ఫాలో అయ్యింది. చాలా బావుంది’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీంతో పలువురు కేఆర్కే‌ని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘వార్తా టీవీ ఛానల్స్‌‌కి తెలియని వార్తలు నీకు మాత్రమే ఎలా తెలుస్తాయి’.. ‘నీకు సమాచారం ఇచ్చే రహస్య సోర్సులు ఏంటి?.. కియారా, సిద్ ఏమైనా చెప్పారా?.. ‘ఎందుకు అందరినీ విమర్శిస్తూ ఉంటావు’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-02-14T11:36:38+05:30 IST

News Hub