Funny Viral Video: ఆహా.. దర్జా అంటే ఇదీ.. మందు కొడుతూ ట్రెడ్‌మిల్‌పై వాకింగ్.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

ABN , First Publish Date - 2023-05-13T16:42:41+05:30 IST

ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి హానికరం. వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. రెండూ కలిపి చేస్తే ఏం జరుగుతుందో మాత్రం చెప్పడం కష్టం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఒకేసారి రెండు పనులూ చేసేస్తున్నాడు.

Funny Viral Video: ఆహా.. దర్జా అంటే ఇదీ.. మందు కొడుతూ ట్రెడ్‌మిల్‌పై వాకింగ్.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

ఆల్కహాల్ (Alcohol) సేవించడం ఆరోగ్యానికి హానికరం. వ్యాయామం (Exercise) చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. రెండూ కలిపి చేస్తే ఏం జరుగుతుందో మాత్రం చెప్పడం కష్టం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో (Viral Video) ఓ వ్యక్తి ఒకేసారి రెండు పనులూ చేసేస్తున్నాడు. ఇంట్లోని ట్రెడ్‌మిల్‌పై (Treadmill) వాకింగ్ చేస్తూ మద్యం సేవిస్తున్నాడు. స్నాక్స్ తింటున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ట్రెడ్ మిల్ ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆ కుర్చీ పక్కనే ఉన్న చిన్న బెంచీ మీద ఆల్కహాల్ బాటిల్, గ్లాస్, కొన్ని స్నాక్స్ ఉన్నాయి. ఆ వ్యక్తి తన కాళ్లను ట్రెడ్ మిల్ మీద కదుపుతున్నాడు. అదే సమయంలో అతడు ఆల్కహాల్ సేవిస్తూ, స్నాక్స్ తింటున్నాడు. పెద్ద కష్టపడినట్టు మొహంపై చెమటను తువ్వాలుతో తుడుచుకుంటున్నాడు. అతను మద్యం సేవిస్తున్నప్పుడు, స్నాక్స్ తింటున్నపుడు కూడా అతడి కాళ్లు ట్రెడ్‌మిల్‌పై కదులుతూనే ఉన్నాయి.

Viral Video: అమ్మాయిని ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ వేసిన ఏనుగు.. ఆ వీడియో చూసి నెటిజన్లు ఎందుకు బాధపడుతున్నారంటే!

@iTheFigen అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియోను కొద్ది గంటల్లోనే 28 వేల మంది వీక్షించారు. ఈ ఫన్నీ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``ఇలా చేసినా క్యాలరీలు కరిగిపోతే ఎంత బాగుణ్ను``, ``ఐడియా బాగుంది.. ఇకపై వాకింగ్ అసలు బోరింగ్ కాదు``, ``మంచి ఉపాయం`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-13T16:42:41+05:30 IST