Heartwarming Viral Video: 10 నెలల కూతుర్ని వదిలి వెళ్లలేక రైల్లోనే వెక్కి వెక్కి ఏడ్చిన మహిళా జవాన్.. హృదయాన్ని మెలిపెడుతున్న ఘటన..!
ABN , First Publish Date - 2023-03-20T18:23:10+05:30 IST
ఏ తల్లి అయినా తన బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎంత కష్టం వచ్చినా బిడ్డను వదలకుండా కళ్లల్లో పెట్టి కాపాడుకుంటుంది. అయితే తాజాగా ఓ మహిళ పది నెలల తన బిడ్డను వదిలి, కన్నీళ్లను దిగమింగుకుని దేశ రక్షణ కోసం పయనమైంది.
ఏ తల్లి (Mother) అయినా తన బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎంత కష్టం వచ్చినా బిడ్డను వదలకుండా కళ్లల్లో పెట్టి కాపాడుకుంటుంది. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో (Viral Video) ఓ మహిళ పది నెలల తన బిడ్డను వదిలి, కన్నీళ్లను దిగమింగుకుని దేశ రక్షణ కోసం పయనమైంది. బిడ్డను వదల్లేక ఆమె రైల్వే స్టేషన్‌లో కన్నీళ్లు పెట్టుకుంది. గుండెలను మెలిపెడుతున్న ఆ వీడియో ఎంతో మందిని భావోద్వేగానికి గురి చేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Heartwarming Viral Videos).
@subhashbajpai18 అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మహారాష్ట్రలోని (Maharashtra) కొల్హాపూర్‌కు చెందిన ఆ మహిళ పేరు వర్షిణి పాటిల్. ఆర్మీలో (Army) పని చేస్తోంది. గర్భవతి అయిన తర్వాత ఆమె సెలవులో ఉంది. పది నెలల క్రితం ఆమె ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పది నెలల పాటు ఆమె ఆలనా పాలనా చూసుకుంది. ఇక, తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యే సమయం వచ్చేసింది. బిడ్డను వదిలి డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు ఆమె సిద్ధమైంది. మొత్తం సర్దుకుని రైల్వే స్టేషన్‌కు చేరుకుంది (Mother Leaves daughter and went to Border).
20 ఏళ్ల నర్సింగ్ యువతి.. తల్లిదండ్రులకు రాసిందో లేఖ.. చనిపోయిన అతడు రోజూ నా కలలోకి వస్తున్నాడంటూ..
రైల్వే స్టేషన్‌లో వర్షిణి తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. భర్తను, తల్లిదండ్రులను కౌగలించుకుని ఏడ్చేసింది. పది నెలల బిడ్డను భర్తను అప్పగించి కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం అందర్నీ వదిలి రైలెక్కింది. రైలు కదులుతున్నా ఆమె డోర్ దగ్గరే నిల్చుని తన వాళ్లకు వీడ్కోలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో (Emotional Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.40 లక్షల మంది చూశారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.