Indian Railway: ఆ లోకో పైలెట్లకు నైట్ డ్యూటీ ఎందుకు ఉండదు..? భారతీయ రైల్వే పాటిస్తున్న ఈ రూల్ గురించి మీకు తెలుసా..?
ABN , First Publish Date - 2023-09-19T15:08:48+05:30 IST
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా భారతీయ రైల్వే గుర్తింపు సంపాదించుకుంది. కొన్ని లక్షల మంది ఉద్యోగులు రైల్వే వ్యవస్థలో పని చేస్తున్నారు. భద్రత విషయంలో రైల్వే చాలా కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా లోకో పైలెట్ల విషయంలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా భారతీయ రైల్వే (Indian Railway) గుర్తింపు సంపాదించుకుంది. కొన్ని లక్షల మంది ఉద్యోగులు (Railway Employees) రైల్వే వ్యవస్థలో పని చేస్తున్నారు. భద్రత విషయంలో రైల్వే చాలా కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా లోకో పైలెట్ల (Loco pilots) విషయంలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. వారికి డ్యూటీ అప్పగించే ముందు సంబంధిత అధికారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. లోకో పైలెట్ ఎవరైనా వరుసగా రెండ్రోజుల పాటు సెలవు తీసుకుంటే అతడికి నైట్ డ్యూటీ (Night Duty) వేయరు.
ఆ లోకో పైలెట్ రెగ్యులర్‌గా నైట్ డ్యూటీ చేసే వాడే అయినా రెండ్రోజులు సెలవు తర్వాత మాత్రం నేరుగా నైటీ డ్యూటీకి పంపించరు. ఎందుకంటే ఆ రెండ్రోజుల్లో లోకో పైలెట్ సరిగ్గా నిద్రపోయాడో, లేదో అని అనుమానం ఉంటుంది. అలాంటి వ్యక్తికి నైట్ డ్యూటీ వేయడం చాలా ప్రమాదకరం. అందుకే అతడిని ముందుగా డే డ్యూటీకి పంపిస్తారు. ఆ రాత్రంతా అతడు నిద్రపోయాక తర్వాతి నుంచి నైట్ డ్యూటీలు కూడా వేస్తారు.
Signature Loan: ఎన్నోసార్లు బ్యాంకులకు వెళ్లి ఉంటారు కానీ.. ఈ సిగ్నేచర్ లోన్ గురించి ఎప్పుడైనా విన్నారా..? ఒక్క సంతకం పెడితే..!
అలాగే ఎవరైనా లోకో పైలెట్ 3 నెలల సుదీర్ఘ సెలవులు తీసుకుంటే తిరిగి వచ్చాక అతడు మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిందే. మూడు నెలలకు పైగా సెలవుపై వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత చేరే ముందు లోకో పైలెట్‌కు మొదటి నుంచి ట్రైనింగ్ (Training) ఇస్తారు. అలాగే ఎవరైనా లోకో పైలెట్ కొత్త ప్రాంతానికి బదిలీ అయితే విధుల్లోకి చేరే ముందు అతడికి కూడా ట్రైనింగ్ ఇస్తారు. అలాగే స్టేషన్లలో విధులు నిర్వర్తించే స్టేషన్ మాస్టర్లకు కూడా కఠిన నిబంధనలనే అమలు చేస్తారు. వారికి సంవత్సరానికి ఒకసారి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు.