Viral Video: నడి వీధిలో రొమాన్స్.. ప్రియుడు చేసిన పనికి యువతి ఆగ్రహం.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-02-27T20:36:39+05:30 IST

యువతీయువకుల మధ్య రొమాన్స్ నడి వీధిలో చిచ్చు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ వీడియోను చూసి నవ్వుకుంటున్నారు (Viral Video).

Viral Video: నడి వీధిలో రొమాన్స్.. ప్రియుడు చేసిన పనికి యువతి ఆగ్రహం.. చివరకు ఏం జరిగిందంటే..

ఈ నెలలో వచ్చిన వాలంటైన్స్ డే‌ను (Valentine’s Day) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికులు (Lovers) ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కొంతమంది మరో అడుగు ముందుకేసి వీధుల్లోనే ఘాటు రొమాన్స్ కూడా పండించారు. ఆయా వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితేప ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తూ చాలా మందిని ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ వీడియోను చూసి నవ్వుకుంటున్నారు (Viral Video).

ఆ వైరల్ వీడియోలో ఓ యువతి బైక్ మీద కూర్చుని ఉంది. ప్రియుడు ఆమె ముందు నిల్చుని దగ్గరకు వెళ్లి ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు (Romance). మొదటి సారి ఆమె ఆ వ్యక్తిని సున్నితంగా వారించింది. అయినా అతడు రెండోసారి ప్రయత్నించాడు. అప్పుడు ఆమె కాస్త చిరాకు ప్రదర్శించడంతో అతడికి కోపం వచ్చి ఆమెను కొట్టాడు. ఆమె కూడా వెనక్కి తగ్గకుండా ప్రియుడిపై పంచ్‌లు కురిపించింది (couple exchanges blows). ఇద్దరూ అక్కడే ఒకరినొకరు కొట్టుకున్నారు (Lovers Romance on street goes wrong). రొమాంటిక్‌గా మొదలైన వీడియో వైలెంట్‌గా ముగిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్ సంపాదించింది.

భార్యను తీసుకెళ్లిపోయిన ప్రియుడి తిక్క కుదిర్చిన భర్త.. అతడి భార్య ఫోన్ నెంబర్‌ను సంపాదించి పెళ్లి ప్రపోజల్.. చివరకు..

Updated Date - 2023-02-27T20:36:41+05:30 IST