ఛీ..ఛీ.. ఇలాంటి మనుషుల మధ్యనా మనం బతుకుతున్నది..? ఈ రిక్షా కార్మికుడి ఫొటో నెట్టింట ఎందుకు వైరల్‌ అయిందంటే..

ABN , First Publish Date - 2023-03-07T16:05:45+05:30 IST

ఆటోలు, ర్యాపిడీలు బాగా అందుబాటులోకి వచ్చాక రిక్షా కార్మికుల జీవితాలు సంక్షోభంలో పడ్డాయి. చాలా మంది రిక్షాలను అమ్మేసుకున్నారు. రిక్షా నడపడం తప్ప వేరే పని చేయలేని వారు ఇప్పటికీ అదే పని చేస్తున్నారు.

ఛీ..ఛీ.. ఇలాంటి మనుషుల మధ్యనా మనం బతుకుతున్నది..? ఈ రిక్షా కార్మికుడి ఫొటో నెట్టింట ఎందుకు వైరల్‌ అయిందంటే..

ఆటోలు, ర్యాపిడోలు బాగా అందుబాటులోకి వచ్చాక రిక్షా కార్మికుల (Rickshaw Puller) జీవితాలు సంక్షోభంలో పడ్డాయి. చాలా మంది రిక్షాలను అమ్మేసుకున్నారు. రిక్షా నడపడం తప్ప వేరే పని చేయలేని వారు ఇప్పటికీ అదే పని చేస్తున్నారు. రోజంతా కష్టపడినా వంద రూపాయలు కూడా రాని పరిస్థితి. అలాంటి వారిని చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) లక్నోలో ఓ వ్యక్తి రిక్షా కార్మికుడిని కేవలం రూ.20 కోసం మోసం చేసి వెళ్లిపోయాడు. అతడి కథ సోషల్ మీడియాలో వైరల్ (Viral Story) అయింది.

ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి లక్నోలోని (Lucknow) జనపథ్ మార్కెట్ దగ్గర రిక్షా పట్టుకుని వెయిట్ చేస్తున్నాడు. అతడి రిక్షాలో వచ్చిన వ్యక్తి జనపథ్ మార్కెట్ దగ్గర దిగి రెండు నిమిషాల్లో వచ్చి డబ్బులు ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఆ 2 నిమిషాలు కాస్తా.. 20 నిమిషాలు అయ్యాయి. గంట దాటినా ఆ వ్యక్తి రాలేదు. తనకు రావాల్సిన రూ.20 కోసం రిక్షా నడిపే సోదరుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ వ్యక్తి కనబడతాడేమోనని అటూ ఇటూ తిరిగాడు. ఆ రిక్షా కార్మికుడి వేదనను @raksha_s27 అనే ట్విటర్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అది కాస్తా వైరల్ అయింది (Lucknow Rickshawala Story).

ఏడుస్తూ కుప్పకూలిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. అంత్యక్రియల తర్వాత అనుమానంతో అతడి ఫోన్‌ను ఆ తండ్రి చెక్ చేస్తే..

చాలా మంది ఈ కథనంపై స్పందిస్తున్నారు. ``పేదల శాపం ఆకాశాన్ని ముక్కలు చేస్తుంది``, ``ఛీ..ఛీ.. ఇలాంటి మనుషుల మధ్యనా మనం బతుకుతున్నది..?``, ``ఇది మానవత్వం పడిపోతున్న స్థాయిని తెలియజేస్తోంది``, ``రూ.20 కోసం ఇంత నీచానికి పాల్పడతారా`` అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-03-07T16:05:45+05:30 IST