Mahima Datla: ఎవరీ మహిమ దాట్ల..? హైదరాబాద్ కు చెందిన ఈమె ఆస్తి ఏకంగా రూ.8700 కోట్లు..!
ABN , First Publish Date - 2023-05-30T20:17:37+05:30 IST
డబ్బు సంపాదించడానికి అష్టకష్టాలు పడేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ హైదరాబాదుకు చెందిన మహిమ దాట్ల మాత్రం 8700కోట్లకు అధిపతి. చెబుతుంటేనే కళ్ళు భైర్లు కమ్మే ఇంత మొత్తానికి..
డబ్బు పేరు చెబితే గుండె లబ్బు డబ్బు అంటుంది. డబ్బు సంపాదించడానికి అష్టకష్టాలు పడేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ హైదరాబాదుకు చెందిన మహిమ దాట్ల మాత్రం 8700కోట్లకు అధిపతి. చెబుతుంటేనే కళ్ళు భైర్లు కమ్మే ఇంత మొత్తానికి ఆమె ఎలా అధిపతి అయ్యింది? అసలు ఈమె ప్రయాణమేంటి? పూర్తీగా తెలుసుకుంటే..
హైదరాబాదుకు(Hyderabad) చెందిన మహిమ దాట్ల(Mahima datla) ప్రస్తుత వయసు 45సంవత్సరాలు. 1953 సంవత్సరంలో ఫార్మా మార్గదర్మకులలో ఒకరైన దాట్ల వెంకట క్రిష్ణంరాజు దాట్ల(Venkata Krishnam Raju datla) బయోలాజికల్ ఇ(Biological E) అనే ఫార్మా సంస్థను స్థాపించారు. రక్తం గడ్డకుండా నిరోధించే హెపారిన్(heparin) అనే మెడిసిన్ కనుగొనడంతో ఈ ఫార్మా ప్రస్థానం మొదలైంది. ఈ ఫార్మా వెంకట క్రిష్ణం రాజుగారి తరువాత ఆయన కుమారుడు విజయ్ కుమార్ దాట్ల(Vijay Kumar datla) చేతుల్లోకి వెళ్ళింది. విజయ్ కుమార్ గారి కూతురే మహిమ దాట్ల. ఈమె లండన్ లోని వెబ్స్టర్ యూనివర్సిటీ(Webster university in London) నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది(Bachelor degree in business administrative management). 2001 నుండి బయోలాజికల్ ఇ లో తనవంతు పాత్ర పోషించింది. అయితే మహిమ దాట్ల తండ్రి విజయ్ కుమార్ 2013లో మరణించడంతో బయోలాజికల్ ఇ బాధ్యతలు మహిమ దాట్ల చేతుల్లోకి వెళ్ళాయి. అప్పటి నుండి సంస్థ సిఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్(Biological E CEO and managing director) గా ఉన్నారామె.
Viral News: సోషల్ మీడియాలో చూసి ఒక్కసారి ట్రై చేసింది.. చివరకు ముఖం ఇలా తయారయింది.. ఈ మహిళ అసలేం చేసిందంటే..!
మహిమ దాట్ల ఆధ్వర్యంలో గత 10ఏళ్ల కాలంలో బయోలాజికల్ ఇ చాలా అభివృద్ది చెందింది. 10ఏళ్ల కాలంలో 200కోట్లకు పైగా డోస్ లతో 100దేశాలకు వ్యాక్సిన్ లను సరఫరా చేసిన ఘనత బయోలాజికల్ ఇ కు దక్కింది. ఈ వ్యాక్సిన్ లలో మీజిల్స్, టెటానస్, రుబెల్లా వంటి వ్యాధులకోసం తయారుచేసిన వ్యాక్సన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆమోదం కూడా ఉంది. మరీ ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా టెటానస్ వ్యాక్సిన్ ను తయారుచేస్తున్నఅతి పెద్ద సంస్థ బయోలాజికల్ ఇ నే.. గత ఏడాది 7,700 కోట్లుగా ఉన్న మహిమ దాట్ల ఆస్తుల విలువ ఈ ఏడాది 1000కోట్లు పెరిగి 8,700కోట్లకు చేరుకుంది. గత ఏడాది Corbevax పేరుతో కోవిడ్-19 వ్యాక్సిన్ ను అభివృద్ది చేయడం ద్వారా గరిష్ట టర్నోవర్ సాధించింది. ప్రస్తుతం ఆమె తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రా, తెలంగాణలలో ఉన్న అత్యంత సంపన్న మహిళ. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ధనికులలో 10వ స్థానంలో ఉంది.