Love: గొప్ప ప్రేమికురాలు.. ప్రియుడి కోసం ఏకంగా రూ.2 వేల కోట్ల ఆస్తిని వదులుకుంది.. చివరకు..
ABN , First Publish Date - 2023-08-15T10:13:22+05:30 IST
ఆమె తండ్రి ఓ బిజినెసై టైకూన్.. పుట్టుకతోనే ఆమె వేల కోట్లకు వారసురాలు.. ఖరీదైన కార్లు, విలాసవంతమైన భవనాల్లో జీవించింది.. అలాంటి యువతి ఓ సాధారణ యువకుడితో ప్రేమలో పడింది.. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది.. అందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదు..
ఆమె తండ్రి ఓ బిజినెసై టైకూన్.. పుట్టుకతోనే ఆమె వేల కోట్లకు వారసురాలు.. ఖరీదైన కార్లు, విలాసవంతమైన భవనాల్లో జీవించింది.. అలాంటి యువతి ఓ సాధారణ యువకుడితో ప్రేమలో (Love) పడింది.. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది.. అందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదు.. అతడిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లిగవ్వ కూడా రాదని బెదిరించారు.. నచ్చినవాడి కోసం ఆ యువతి వేల కోట్ల ఆస్తిని కాదనుకుంది.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి ప్రియుడితో కలిసి జీవిస్తోంది (Viral News).
మలేసియా (Malaysia)కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఖూ కే పెంగ్ ( Khoo Kay Peng) కూతురు ఏంజెలీనా ఫ్రాన్సెస్ (Angeline Francis) ప్రేమకథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏంజెలీనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో జెడియా అనే సాధారణ మధ్యతరగతి యువకుడితో ప్రేమలో పడింది. అతడినే వివాహం చేసుకోవాలనుకుంది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ వివాహానికి పెంగ్ అంగీకరించలేదు. తమ మాట కాదని నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వారసత్వంగా వచ్చే ఆస్తి దక్కదని బెదిరించాడు. దీంతో ఏంజెలీనా 2008లో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి ప్రియుడిని వివాహం (Marriage) చేసుకుని తను కోరుకున్నట్టుగా జీవిస్తోంది.
Heart Breaking: ``నేను చనిపోతున్నా.. మీ నాన్న చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకో``.. హాస్పిటల్ బెడ్ మీద నుంచి ప్రియురాలికి లాస్ట్ కాల్..
అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రులకు పూర్తిగా దూరమైంది. అయితే ఇటీవల పెంగ్, అతడి భార్య పాలైన్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చేందుకు ఏంజెలీనా వెళ్లాల్సి వచ్చింది. కోర్టులో తన తల్లికి మద్దతుగా మాట్లాడిన ఏంజెలీనా, తండ్రి ప్రవర్తనపై విమర్శలు గుప్పించింది. తన తల్లిదండ్రలు కలిసి జీవించాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. తల్లిదండ్రుల విడాకుల వ్యవహారం కారణంగా ఏంజెలీనా ప్రేమకథ మళ్లీ చర్చనీయాంశంగా మారింది.