Viral: ఛీ..ఛీ.. ఇదేం పనయ్యా బాబూ.. కట్టుకున్న భార్యను వేశ్య అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడో ఎన్నారై భర్త!

ABN , First Publish Date - 2023-08-26T18:08:30+05:30 IST

భార్యకు ఏదైనా కష్టం వస్తే, ఇతర వ్యక్తులు వేధిస్తుంటే ఎదురు నిలిచి పోరాడాల్సిన వ్యక్తి భర్త. అలాంటి వ్యక్తే సోషల్ మీడియా వేదికగా వేధింపులకు దిగితే భార్య ఏం చేస్తుంది? కట్టుకున్న భర్తపై మంగుళూరుకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త చేసిన నీచమైన పని గురించి పోలీసులకు తెలిపింది.

Viral: ఛీ..ఛీ.. ఇదేం పనయ్యా బాబూ.. కట్టుకున్న భార్యను వేశ్య అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడో ఎన్నారై భర్త!

భార్య (Wife)కు ఏదైనా కష్టం వస్తే, ఇతర వ్యక్తులు వేధిస్తుంటే ఎదురు నిలిచి పోరాడాల్సిన వ్యక్తి భర్త (Husband). అలాంటి వ్యక్తే సోషల్ మీడియా వేదికగా వేధింపులకు దిగితే భార్య ఏం చేస్తుంది? కట్టుకున్న భర్తపై మంగుళూరు (Mangaluru)కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త చేసిన నీచమైన పని గురించి పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు (Crime News).

మంగుళూరలోని బాజ్‌పే ప్రాంతానికి చెందిన ఫ్లావియా టెల్లిస్ అనే మహిళ భర్త డొనాల్డ్ దుబాయ్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. భర్త వేరే దేశంలో ఉండడంతో 35 ఏళ్ల ఫ్లావియా మంగుళూరులోని తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. కాగా, కొద్ది రోజుల క్రితం ఫ్లావియా, డొనాల్డ్ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. అప్పట్నుంచి ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఫ్లావియాను మాత్రమే కాదు.. ఆమె తల్లిదండ్రులను కూడా డొనాల్డ్ మానసికంగా హింసించేవాడు. అసభ్యం పదజాలంతో దూషించేవాడు (Husband harasses wife).

Viral Video: వారెవ్వా.. సూపర్ ఐడియా.. స్పామ్ కాల్స్‌ను భరించలేక ఓ మహిళ ఏం చేసిందో మీరే చూడండి..!

తాజాగా డొనాల్డ్ వేధింపులు తారస్థాయికి చేరాయి. ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి భార్యపై అసభ్య ప్రచారం ప్రారంభించాడు. ఫ్లావియా ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమెను ``వేశ్య`` (Prostitute)గా పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె ఫోన్ నెంబర్ కూడా పోస్ట్ చేసి, అవసరమైన వారు సంప్రదించవచ్చని రాశాడు. దీంతో ఫ్లావియాకు కాల్స్ రావడం ప్రారంభించాయి. అదంతా భర్త చేసిన పని అని తెలుసుకున్న ఫ్లావియా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - 2023-08-26T18:08:30+05:30 IST