Share News

Viral: కొడుకు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో రెచ్చిపోయిన తండ్రి.. పబ్లిక్‌గా అందరి ముందూ.. అతడి తప్పు ఏంటంటే..

ABN , First Publish Date - 2023-10-13T16:13:16+05:30 IST

క్లాసులకు వెళుతున్నానంటూ తల్లిదండ్రులకు అబ్బద్ధాలు చెప్పి బయట ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేందుకు వచ్చిన ఓ టీనేజర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. కొడుకును రెడ్ హ్యాండెడ్‌గా దొరకబుచ్చుకున్న తండ్రి అతడిని చావచితక కొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Viral: కొడుకు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో రెచ్చిపోయిన తండ్రి.. పబ్లిక్‌గా అందరి ముందూ.. అతడి తప్పు ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: పిల్లలు అన్నాక అప్పుడప్పుడూ అబద్ధాలు గట్రా చెబుతుంటారు. కానీ అదే అలవాటుగా మారితే మాత్రం వారి భవిష్యత్తుకే ఎసరు వస్తుంది. మరి పిల్లలు తప్పుడు దారిలో వెళుతుంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? వారిని ఎలా సన్మార్గంలో పెట్టాలి?..నెటిజన్లు ఓ వీడియో(Viral Video) చూసి వేస్తున్న ప్రశ్నలు ఇవి. అబద్ధాలు చెప్పి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఓ టీనేజర్‌ను అతడి తల్లిదండ్రులు పబ్లిక్‌గా దబిడిదిబిడి ఆడేశారు(Man beats up son in front of friends at cafe).ఇది చూసి అక్కడున్న వారే కాకుండా నెటిజన్లు కూడా దిమ్మెరపోతున్నారు.

Viral: నన్నేం చేయమంటారో మీరైనా చెప్పండి..నెట్టింట వ్యక్తి అర్థింపు.. ఆన్‌లైన్‌లో ల్యాప్‌‌టాప్ ఆర్డరిచ్చాక..


ఇంతకీ జరిగిందేంటంటే.. ఓ టీనేజర్ క్లాసులకు వెళుతున్నానని చెప్పి ఫ్రెండ్స్ వచ్చి ఓ కేఫ్‌కు వచ్చి ఎంజాయ్ చేయడం ప్రారంభించాడు. ఈ విషయం తండ్రికి ఎలా తెలిసిందో గానీ కుర్రాడు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న టైంలో తల్లిదండ్రులు ఎంట్రీ ఇచ్చారు. ఇక కొడుకు చూడగానే తండ్రికి కోపం నషాళానికి అంటింది. ‘‘ఏం చెప్పావురా నాకు ఇందాక..’’అంటూ అతడిపై చెళ్లుమనిపించాడు. అది మొదలు పలుమార్లు కొడుకు దవడ పేలకొట్టాడు. అతడినే కాకుండా, అక్కడున్న అతడి స్నేహితులను కూడా చుక్కలు చూపించాడు. పక్కనే ఉన్న కుర్రాడి తల్లి కూడా వాళ్లమీద గయ్యిమని లేచింది. కేఫ్‌లోని ఇతర కస్టమర్లు ఇదంతా చూసి నోరెళ్లబెట్టారు. ఒక్కరు కూడా తండ్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Shocking: 13 మంది అమ్మాయిలతో నగ్నంగా డాన్సులు వేయించిన వ్యాపారవేత్త.. అసలు కారణం తెలిసి విస్తుపోయిన పోలీసులు..!


ఇక సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో సంచలనంగా మారింది. కొందరు ఆ తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వగా మరికొందరు కుర్రాడి పరిస్థితి తలుచుకుని జాలి పడ్డారు. ఈ కాలంలో తల్లిదండ్రులు స్ట్రిక్ట్‌గా పిల్లలు లేకపోతే చెడిపోతారంటూ అనేక మంది కామెంట్ చేశారు. కుర్రాడు కట్టుతప్పకుండా ఉండాలంటే ఈ మాత్రం డోసు పడాల్సిందేనని చెప్పుకొచ్చారు. పిల్లలను దార్లో పెట్టేందుకు ఇది సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. తండ్రి చేసిన పని కొడుకు మనసుపై శాశ్వత ప్రభావం చూపుతుందని, మానసిక ఆరోగ్యం దెబ్బతీస్తుందని కామెంట్ చేశారు.

Viral: భార్యాపిల్లలతో పాటూ పెట్రోల్ బంక్‌కు వచ్చిన వ్యక్తిని చూసి సిబ్బంది షాక్.. అతడేం చేశాడంటే..

Updated Date - 2023-10-13T16:13:18+05:30 IST