Viral Video: ఒక్క క్షణం ఆగి ఉంటే.. ఆ తండ్రీకూతుళ్ల ప్రాణాలు పోయేవి.. ఏనుగు అడ్డాలోకి దూరి ఫొటోలో తీసుకుంటోంటే..!

ABN , First Publish Date - 2023-09-15T15:43:39+05:30 IST

ఏనుగుతో పాటూ ఫొటో దిగేందుకు కంచెను దాటి ఏనుగు బోనులోకి వెళ్లిన ఓ తండ్రీ కూతుళ్లకు భయానక అనుభవం ఎదురైంది. ఏనుగు ఒక్కసారిగా దాడికి యత్నించడంతో వారు పరుగుపరుగు కంచె దూకి బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంకో క్షణం ఆలస్యం అయ్యి ఉంటే వారి ప్రాణాలు పోయేవని నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.

Viral Video: ఒక్క క్షణం ఆగి ఉంటే.. ఆ తండ్రీకూతుళ్ల ప్రాణాలు పోయేవి.. ఏనుగు అడ్డాలోకి దూరి ఫొటోలో తీసుకుంటోంటే..!

ఇంటర్నెట్ డెస్క్: పిల్లల కోసం తల్లిదండ్రులు తమ ప్రాణాలను పణంగా పెట్టేందుకు కూడా వెనకాడరు. వారికి అపాయం తలపెట్టే పనిని కలలో కూడా చేయరు. మరీ ఈ వీడియోలోని వ్యక్తి ఓ ఫోటో కోసం తన ప్రాణాలతో తన కూతురి ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేశాడు. ఏనుగుతో ఫొటో దిగాలనుకున్న వ్యక్తి ఏకంగా కంచెను దాటుకుని కూతురితో సహా ఏనుగు స్థావరంలోకి వెళ్లాడు. ఆ తరువాత ఏనుగు ఏం చేసిందో చూపించే వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఒళ్లుగగుర్పొడిచే ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది.

అడవి జంతువులను చూస్తే ఎవరికైనా ఆసక్తి కలుగుతుంది. వాటిని మరింత దగ్గర నుంచి పరిశీలించాలని ఉత్సాహం ప్రదర్శిస్తారు. ఇలాంటి కుతూహలం ప్రమాదకరమని చెబుతూ అనేక జంతుప్రదర్శన శాలల్లో నిర్వహకులు ఏర్పాటు చేస్తుంటారు. మనదేశంలో అయితే ఇంగ్లిష్‌తో పాటూ స్థానిక బాషల్లోనూ ఈ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తారు. కానీ వీడియోలోని వ్యక్తి మాత్రం ఈ హెచ్చరికలేవీ పట్టించుకోలేదు.


ఏనుగుతో ఫొటో దిగాలన్న కోరిక అతడిని కుదురుగా ఉండనీయలేదు. తన వెంట కూతురు ఉందన్న విషయాన్ని కూడా లెక్కచేయలేదు సరికదా.. ఏకంగా చిన్నారిని తీసుకుని ఏనుగు బోను చుట్టూ ఉన్న కంచె దాటుకుని లోపలికి వెళ్లాడు(Man enters elephant enclosure with his daughter). బ్యాక్ గ్రౌండ్‌లో ఏనుగు ఉండగా ఫొటో దిగేందుకు ప్రయత్నించాడు. అంతే, ఊహించని విధంగా ఆ ఏనుగు అతడి వైపు పెద్ద పెట్టున ఘీంకారం చేస్తూ పరిగెత్తుకు వచ్చింది(Elephant tries to attack).

ఏనుగు ఘీంకారం వినగానే మనోడు అప్రమత్తమైపోయాడు. కూతురిని ఎత్తుకుని వేగంగా కంచెవైపు పరుగు తీశారు. ఆ తరువాత క్షణకాలంలో కంచె దాటుకుని బయటపడ్డాడు(Man daughter escape). ఇదంతా కేవలం సెకెన్ల వ్యవధిలో జరిగిపోయింది. అతడు స్పందించడంలో రెండు మూడు సెకెన్ల ఆలస్యం జరిగున్నా ఆ తండ్రీ కూతుళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడేవి. వారి ఆయుష్షు గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు. ఇక వీడియోలో ఈ ఘటనా క్రమాన్నంతా చూసిన నెటిజన్లు భయపడిపోతున్నారు. అతడిని తిట్టిపోస్తున్నారు. పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ఎలా అంటూ వరుస కామెంట్లతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వైరల్ వీడియోను(Viral Video) మీరూ చూసేయండి.

Updated Date - 2023-09-15T15:47:23+05:30 IST