Viral Video: ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.. బిజీ రోడ్డు మీద కారు టాప్ మీద కూర్చుని మందేస్తూ..

ABN , First Publish Date - 2023-01-10T19:16:19+05:30 IST

చాలా మంది వ్యక్తులు మద్యం సేవించడానికి ప్రత్యేక స్థలాన్ని ఎంచుకుంటారు. బార్‌లోనో, రెస్టారెంట్‌లోనో, లేదా మరైదేనా రహస్య స్థలంలోనో మందు కొడుతూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం రొటీన్‌కు భిన్నంగా ఆలోచించినట్టున్నాడు.

Viral Video: ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.. బిజీ రోడ్డు మీద కారు టాప్ మీద కూర్చుని మందేస్తూ..

చాలా మంది వ్యక్తులు మద్యం సేవించడానికి ప్రత్యేక స్థలాన్ని ఎంచుకుంటారు. బార్‌లోనో, రెస్టారెంట్‌లోనో, లేదా మరైదేనా రహస్య స్థలంలోనో మందు కొడుతూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం రొటీన్‌కు భిన్నంగా ఆలోచించినట్టున్నాడు. రద్దీ రోడ్డుపై ట్రాఫిక్‌ మధ్యలో కారు పైకప్పుపై కూర్చుని మద్యం సేవిస్తూ (Man Drinks Alcohol On Car's Roof) అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. హర్యానాలోని గురుగ్రామ్‌లో (Gurugram) ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న కారు పై కూర్చుని ప్రశాంతంగా మద్యం సేవిస్తూ ఉన్నాడు. అంతేకాదు కారులో ముందు సీట్లో కూర్చున్న మరో వ్యక్తికి కూడా పై నుంచి మందు సప్లై చేశాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న జనం వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా, అది కాస్తా వైరల్‌ అవుతోంది. రవి హందా అనే నెటిజన్‌ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసి గురుగ్రామ్‌లో మాత్రమే ఇలా జరుగుతుంది అని కామెంట్ చేశాడు. ఈ వీడియోను (Viral Video) ఇప్పటి వరకు 60వేల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-01-10T19:16:21+05:30 IST