Viral: వీళ్లేం మనుషులండీ బాబూ.. డెలివరీ కోసం భార్యను తీసుకెళ్తే.. ఆస్పత్రి ముందే అల్లుడితో గొడవ.. చివరకు..!
ABN , First Publish Date - 2023-07-04T15:40:03+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఓ ఆస్పత్రి ఎదుట రెండు కుటుంబాలు తీవ్రంగా గొడవ పడ్డాయి. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారు బంధువులే. చాలా చిన్న విషయంలో మనస్పర్థలు రావడంతో ఇలా రోడ్డున పడి కొట్టుకున్నారు
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బారాబంకిలో ఓ ఆస్పత్రి ఎదుట రెండు కుటుంబాలు తీవ్రంగా గొడవ పడ్డాయి. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారు బంధువులే. చాలా చిన్న విషయంలో మనస్పర్థలు రావడంతో ఇలా రోడ్డున పడి కొట్టుకున్నారు. హాస్పిటల్‌లో ఏసీ రూమ్ (AC Room) బుక్ చేయలేదనే కారణంతో ఈ గొడవ జరిగిందని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
బారాబంకిలోని వికాస్ కాలనీకి చెందిన రామ్‌కుమార్ భార్యకు నెలలు నిండడంతో ఆమెను ఆదివారం ఉదయం సివిల్ లైన్ వద్ద ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో (Hospital) చేర్చారు. ఆమె ఆదివారం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే డెలివరీ టైమ్‌లో తమ బిడ్డ కోసం హాస్పిటల్‌లో ఏసీ రూమ్ బుక్ చేయలేదని మహిళ తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఆ గొడవ పెద్దదిగా మారిపోయింది.
Viral News: వర్షం వస్తోందని నెమ్మదిగా వెళ్తున్నా.. సడన్‌గా కుంగిన రోడ్డు.. సర్కారుపై నెటిజన్ల సెటైర్లు మామూలుగా లేవుగా..!
ఆస్పత్రి గేటు వెలుపల రామ్‌కుమార్‌తో అతని అత్తమామలు గొడవ పడ్డారు. గట్టిగా కేకలు వేసుకుంటూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తర్వాత ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.