Crime News: దెయ్యమై కలలోకి వచ్చి వేధిస్తున్నాడట.. 20 ఏళ్ల క్రితం పాతి పెట్టిన శవం కోసం అడవిలో తవ్వకాలు..!
ABN , First Publish Date - 2023-04-21T13:30:03+05:30 IST
ఛత్తీస్‌గఢ్‌లోని (chhattisgarh) ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాకు చెందిన టికం కొలియారా అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం ఛవేశ్వర్ గోయల్ అనే వ్యక్తిని 2003లో చంపేసి అడవిలో పాతిపెట్టాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాకు చెందిన టికం కొలియారా అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం ఛవేశ్వర్ గోయల్ అనే వ్యక్తిని 2003లో చంపేసి అడవిలో పాతిపెట్టాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో ఛవేశ్వర్‌ను కిరాతకంగా చంపేశాడు. 20 ఏళ్లుగా ఛవేశ్వర్ కనిపించకపోయినా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడని అనుకున్నారు. అయితే ఆ హత్యను మాత్రం కొలియారా మర్చిపోలేకపోయాడు (Crime News).
కొలియారా కలలో కూడా ఛవేశ్వర్ కనిపించేవాడు. దీంతో గతేడాది తను చేసిన హత్య గురించి గ్రామస్థులకు కొలియారా చెప్పేశాడు. గ్రామస్థులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కొలియారాను అదుపులోకి తీసుకున్నారు. అతడు చెప్పిన వివరాల ప్రకారం ఛవేశ్వర్ మృతదేహం కోసం అడవిలో తవ్వకాలు చేపట్టారు. కానీ, ఛవేశ్వర్ మృతదేహం మాత్రం దొరకలేదు. ఈ లోపు కొలియారా మానసికంగా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో పోలీసులు కొలియారాను అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఛవేశ్వర్ మృతదేహం గురించి అన్వేషణ మానేశారు.
Crime News: ఈ చేతి పంపు వల్లే ఓ మహిళ ప్రాణం పోయింది.. నీళ్ల కోసం వెళ్లిన ఆమె చివరకు రక్తపు మడుగులో..
ఛవేశ్వర్ తండ్రి తాజాగా పోలీసులను ఆశ్రయించి తన కొడుకు మృతదేహం కావాలని పట్టుబట్టాడు. దీంతో పోలీసులు చేసేది లేక మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. చివరకు అడవిలోని ఓ ప్రాంతంలో కొన్ని ఎముకలు, దుస్తులను కనుగొన్నారు. అవి ఛవేశ్వర్వో, కావో తెలుసుకునేందుకు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఈ కేసులో ముందుకెళ్తామని చెప్పారు.