Viral Video: ఎదురుగా భారీ తిమింగలం.. భయపడకుండానే దాన్ని పట్టుకుని ముద్దు కూడా పెట్టుకుంటోంటే దాని రియాక్షన్ చూడండి..!
ABN , First Publish Date - 2023-04-26T13:00:41+05:30 IST
సముద్ర జీవులైన తిమింగలాలు ప్రమాదకర జీవులు కావు. ఇవి సముద్ర జీవులే అయినప్పటికీ మనుషులతో చాలా సన్నిహితంగా ఉంటాయి. వారికి మచ్చిక అవుతాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో మనిషి, తిమింగలం మధ్యనున్న బంధాన్ని తెలియజేసింది.
సముద్ర జీవులైన తిమింగలాలు (Whales) ప్రమాదకర జీవులు కావు. ఇవి సముద్ర జీవులే అయినప్పటికీ మనుషులతో చాలా సన్నిహితంగా ఉంటాయి. వారికి మచ్చిక అవుతాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) మనిషి, తిమింగలం మధ్యనున్న బంధాన్ని తెలియజేసింది. వీడియోలో బూడిద, నలుపు రంగుల మిశ్రమంలో కనిపిస్తున్న ఆ తిమింగలం పేరు ``మార్గరీటా``. సముద్రం మధ్యలో ఉన్న ఆ తిమంగలంతో ఓ వ్యక్తి చాలా ప్రేమపూర్వకంగా వ్యవహరించాడు.
silversharkadventures అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి బోటులో సముద్రం మధ్యలోకి వెళ్లాడు. అక్కడ కనిపించిన మార్గరీటా అనే తిమింగలాన్ని పట్టుకున్నాడు. దానిని చేతితో నిమురుతూ లాలించాడు. ఆ తర్వాత దానిని ముద్దు పెట్టుకున్నాడు (Man kissed the huge whale). ఆ తిమింగలం కూడా ఆ వ్యక్తితో స్నేహపూర్వకంగా వ్యవహరించింది. కదలకుండా అతడి దగ్గరే ఉంది. ఈ మొత్తం ఘటనను బోటులో ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు.
Viral Video: హెల్మెట్ లేదు.. ఎదురుగా పోలీసులు.. ఓ చిన్న ట్రిక్‌తో ఫైన్ నుంచి తప్పించుకున్న కుర్రాడు..!
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐదు వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ``ఈ వీడియో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది``, ``ఈ వీడియో నన్ను కదిలించింది. ఆ తిమింగలం చాలా మంచిది``, ``ఇది నిజంగా గొప్ప అనుభవం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.