Bride: రెండ్రోజుల క్రితమే పెళ్లి.. నిద్ర వస్తోందంటూ గదిలోకి వెళ్లిన భార్య.. పనులన్నీ పూర్తయ్యాక అర్ధరాత్రి భర్త తలుపులు తీసి చూస్తే..
ABN , First Publish Date - 2023-03-18T15:39:00+05:30 IST
ఆ యువకుడి తల్లికి అనారోగ్యంగా ఉంది.. చూసుకునే వారు ఎవరూ లేరు.. దాంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.. మధ్యవర్తికి రెండున్నర లక్షల రూపాయలు చెల్లించి మరీ పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు..
ఆ యువకుడి తల్లికి అనారోగ్యంగా ఉంది.. చూసుకునే వారు ఎవరూ లేరు.. దాంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.. మధ్యవర్తికి రెండున్నర లక్షల రూపాయలు చెల్లించి మరీ పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు.. ఘనంగా పెళ్లి (Marriage) చేసుకుని వధువును ఇంటికి తీసుకెళ్లాడు.. రెండ్రోజుల వరకు బాగానే ఉన్న వధువు మూడో రోజు ఇంటి నుంచి మాయమైంది.. మధ్యవర్తికి ఫోన్ చేసిన వరుడికి షాక్ తగిలింది.. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు (Crime News).
రాజస్థాన్‌లోని (Rajasthan) ఝంఝను ప్రాంతానికి చెందిన సోమ్‌వీర్ అనే యువకుడు బిజ్జు అనే మధ్యవర్తి ద్వారా పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. రూ.2.50 లక్షలకు డీల్ మాట్లాడుకుని రూ. లక్ష అడ్వాన్స్‌గా చెల్లించాడు. ఆ మధ్యవర్తి గీతా దేవితో సోమ్‌వీర్‌కు వివాహం కుదిర్చాడు. ఇద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం గీతా దేవిని సోమ్‌వీర్ తన ఇంటికి తీసుకెళ్లాడు. బిజ్జుకు చెల్లించాల్సిన లక్షన్నరను ఇచ్చేశాడు. రెండ్రోజులు సోమ్‌వీర్ ఇంట్లో గీతాదేవి బాగానే ఉంది. మూడో రోజు రాత్రి నిద్ర వస్తోందని చెప్పి రాత్రి ఏడు గంటలకే బెడ్రూమ్‌లోకి వెళ్లిపోయింది.
అమ్మమ్మా.. ఆ ఆటో డ్రైవర్‌ను పిలవొద్దు.. వాడు మంచోడు కాదంటూ ఏడుస్తూ చెప్పిన 9 ఏళ్ల బాలిక.. అసలేం జరిగిందని ఆ బామ్మ ఆరా తీస్తే..
రాత్రి పది గంటల సమయంలో బెడ్రూమ్‌లోకి వెళ్లిన సోమ్‌వీర్‌కు గీతా దేవి కనిపించలేదు. ఆమె గురించి ఇల్లంతా వెతికినా ఆచూకీ దొరకలేదు. తర్వాతి రోజు కూడా గీతా దేవి తిరిగి రాలేదు. దీంతో మధ్యవర్తి బిజ్జుకు సోమ్‌వీర్ ఫోన్ చేశాడు. అప్పుడు అతనికి షాకింగ్ విషయం తెలిసింది. తామంతా ఒక ముఠా అని, డబ్బుల కోసం ఇలా మోసం చేస్తూ ఉంటామని చెప్పాడు. దీంతో సోమ్‌వీర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లో నగదు, నగలు తీసుకుని గీతా దేవి పారిపోయినట్టు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.