Share News

Shocking: వార్నీ.. రెజ్యూమ్‌లో ఎవరైనా ఇలాంటివి రాస్తారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ బయోడేటా!

ABN , First Publish Date - 2023-11-04T20:58:29+05:30 IST

ప్రభుత్వ రంగంలోనైనా, ప్రైవేట్ రంగంలోనైనా ఉద్యోగం సంపాదించాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా తమ వివరాలు తెలియజేస్తూ ముందుగా ఓ రెజ్యూమ్‌ను పంపించాలి. ఆ రెజ్యూమ్ నచ్చితే సంస్థ ప్రతినిధులు అతడిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. అందుకే రెజ్యూమ్‌ను ఆకట్టుకునే విధంగా తయారు చేసేందుకు అభ్యర్థులు కిందా మీదా పడుతుంటారు.

Shocking: వార్నీ.. రెజ్యూమ్‌లో ఎవరైనా ఇలాంటివి రాస్తారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ బయోడేటా!

ప్రభుత్వ రంగంలోనైనా, ప్రైవేట్ రంగంలోనైనా ఉద్యోగం సంపాదించాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా తమ వివరాలు తెలియజేస్తూ ముందుగా ఓ రెజ్యూమ్‌ను (Resume) పంపించాలి. ఆ రెజ్యూమ్ నచ్చితే సంస్థ ప్రతినిధులు అతడిని ఇంటర్వ్యూకు (Interview) పిలుస్తారు. అందుకే రెజ్యూమ్‌ను ఆకట్టుకునే విధంగా తయారు చేసేందుకు అభ్యర్థులు కిందా మీదా పడుతుంటారు. తమకు ఉన్న స్కిల్స్ అన్నింటినీ రెజ్యూమ్‌లో పొందుపరుస్తారు. అయితే తాజాగా ఓ సంస్థ సీఈవోకు వచ్చిన రెజ్యూమ్ (Weird Resume) చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.

@roshanpatel అనే ట్విటర్ యూజర్ ఆ రెజ్యూమ్‌ను ట్విటర్‌లో షేర్ చేశారు. న్యూయార్క్‌కు (NewYork) చెందిన వాల్‌నట్ అనే హెల్త్ కేర్ కంపెనీ సీఈవోకు ఈ విచిత్రమైన రెజ్యూమ్ వచ్చింది. అది చదివి ఆయన ఆశ్చర్యపోయారు. ఇంతకీ అందులో ఏముందంటే.. ఆ అభ్యర్థి తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలతో పాటు ఆరోగ్య సమాచారాన్ని కూడా రెజ్యూమ్‌లో పొందుపరిచాడు. ముఖ్యంగా తన స్పెర్మ్ కౌంట్ (Sperm Count) ఎంతుందో కూడా అందులో రాశాడు. అతను తన స్పెర్మ్ కౌంట్ 800 మిలియన్ అని పేర్కొన్నాడు. దీంతో ఆ సీఈవో షాకయ్యాడు.

Viral Video: మీరు అప్పడాలు ఇష్టంగా తింటారా? అప్పడాలను ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూడండి.. వీడియో వైరల్!

ఆ వైరల్ పోస్ట్‌ను ఇప్పటివరకు 23 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``అతడు తన డీఎన్‌ఏ డేటాను పంపించడం మర్చిపోయినట్టున్నాడు``, ``అతడు స్పెర్మ్‌డోనార్ ఉద్యోగానికి అప్లై చేశాడేమో``, ``జాబ్ సెర్చింగ్‌లో బాగా విసిగిపోయినట్టున్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-04T20:58:34+05:30 IST